యట ప్రపంచానికి పండగ అంటే బిగ్ బాస్‌ హౌజ్‌లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. కంటెస్టెంట్స్ అంతా సరదాగా పండగలు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ రోజంతా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా కంటెస్టెంట్స్ అంతా కలిసి వినాయక చవితి సందర్భంగా వినాయకుడి పూజ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో కంటెస్టెంట్స్ అంతా కాసేపు సరదాగా పండగను సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించినా.. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. మూడోవారంలో మూడో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెస్టెంట్స్‌ను సెలక్ట్ చేశారు బిగ్ బాస్. ఆ తర్వాత ఆట మరో మలుపు తిరిగింది.


పవర్ అస్త్రా కోసం పోటీకి ఆ ముగ్గురు సిద్ధం..
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి రెండు వారాలు దాటిపోయింది. ఈ రెండు వారాల్లోని మొదటి వారంలో మొదటి పవర్ అస్త్రా సాధించుకున్నాడు సందీప్. రెండో వారంలో పవర్ అస్త్రా.. శివాజీ చేతికి వెళ్లింది. ఇప్పుడు మూడో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. అసలు ఈసారి పవర్ అస్త్రా కోసం పోటీ ఎలా ఉంటుంది అని ఎదురుచూసిన ప్రేక్షకులకు, కంటెస్టెంట్స్‌కు మంచి ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. మూడో పవర్ అస్త్రా కోసం పోటీ పడే కంటెస్టెంట్స్‌ను ఆయనే సెలక్ట్ చేశారు. అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్.. పవర్ అస్త్రా కోసం పోటీపడుతున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఆయన సెలక్ట్ చేసిన ముగ్గురిలో ఏ ఒక్కరు పవర్ అస్త్రాకు అనర్హులో చెప్పమని బిగ్ బాస్ అడిగారు. 


వారు అర్హులు కాదు..
కంటెస్టెంట్స్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన తర్వాత పలువురు.. శోభా శెట్టి.. పవర్ అస్త్రా కోసం అనర్హురాలు అంటూ చెప్పారు. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ శోభా శెట్టిని అనర్హురాలు అంటూ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. శుభశ్రీ అయితే అమర్‌దీప్ కూడా అంత స్ట్రాంగ్ కాదంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక కూడా శోభా శెట్టితో పోలిస్తే తానే బెటర్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దామిని అయితే ప్రిన్స్ యావర్‌ను అనర్హుడంటూ చెప్పుకొచ్చింది. ‘‘బుర్ర పెట్టి ఆడాల్సినవి, బుద్ధి పెట్టి ఆడాల్సినవి తను బుద్ధి పెట్టడేమో అని నేను అనుకుంటున్నాను’’ అంటూ యావర్ అనర్హుడు అనడానికి కారణం చెప్పింది. ఎవరికి వారు అభిప్రాయాలు బయటపెట్టిన తర్వాత.. కంటెస్టెంట్స్.. కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడిన విషయాలను అందరి ముందు ప్రసారం చేశారు బిగ్ బాస్.


చిల్లర లొల్లి..
పవర్ అస్త్రా పోటీలో తన పేరు పిలవనందుకు బిగ్ బాస్‌పైనే అలిగాడు పల్లవి ప్రశాంత్. ‘‘నేను మీకు నచ్చలేదా’’ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అదే కారణంతో రోజంతా పల్లవి ప్రశాంత్ కాస్త బాధగానే ఉన్నాడు. అనుకోకుండా ప్రశాంత్‌కు, రతికకు గొడవ అయినట్టుగా తాజాగా విడుదలయిన ప్రోమోలో చూపించారు. ఒక్కసారిగా రతికను ‘‘పో తల్లి. పక్కకెళ్లి ఆడుకో’’ అంటూ వెటకారం చేశాడు ప్రశాంత్. దానికి ‘‘నువ్వు పో’’ అంటూ సమాధానమిచ్చింది రతిక. ‘‘చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మళ్లీ మళ్లీ చెప్తున్నా’’ అంటూ వేలెత్తి చూపించింది. ‘‘వేలు దించు’’ అని కోపంగా అన్నాడు ప్రశాంత్. పో అంటూ రతికకు పక్కకు తోశాడు. దానికి రతిక సీరియస్ అయ్యింది. ‘‘చేయి వేస్తే ఇంకొకసారి మర్యాదగా ఉండదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి ప్రశాంత్ ‘‘చిల్లర లొల్లి’’ అని కామెంట్ చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.



Also Read: కరీనాతో అలాంటి సీన్, చాలా భయమేసిందంటున్న తమన్నా బాయ్ ఫ్రెండ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial