బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఇది అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ దీని గురించి గ్రూపులుగా విడిపోయి డిస్కషన్ మొదలు పెట్టారు. ఈ దఫా అందరూ దామిని, శుభశ్రీని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో అందరూ జంటలు జంటలుగా కూర్చుని నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఇందులో హైలెట్ ఏంటంటే రతిక, ప్రశాంత్. బాధలో ఉన్న రతికని క్షణాల్లో నవ్వించేసి మళ్ళీ వీళ్ళ మధ్య ఏదో ఉందని అనిపించేలా చేశాడు. ప్రోమోలో ఏముందంటే..


శివాజీ, తేజ, శోభాశెట్టి ఒక చోట కనిపించారు. దామిని సొంత గేమ్ ఆడటం లేదు సేఫ్ గేమ్ ఆడుతుందని శివాజీ చెప్పుకొచ్చాడు. మొదట్లో తనతో బాగానే ఉన్న దామిని సడెన్ గా తనతో డిస్కనెక్ట్ అయిపోయి తనని నామినేట్ చేసిందని అన్నాడు. రతిక, శోభా శెట్టి ఏదో విషయం గురించి మాట్లాడుకున్నారు. గౌతమ్ ని నన్ను కూర్చోబెట్టి అడిగితే అయిపోయే దానికి నామినేషన్స్ లో అలా అన్నావు.. అలా చేస్తే ఎలా ఉంటుందని రతికని ప్రశ్నిస్తుంది. తేజ, సందీప్ కూర్చుని ప్రశాంత్ గురించి మాట్లాడుకున్నారు. నామినేషన్స్ లో ప్రశాంత్ ని తేజ ఒక్కడే నామినేట్ చేశాడు. ఈరోజు తనకి నామినేషన్స్ అవకాశం ఉంటే తను కూడా ప్రశాంత్ ని నామినేట్ చేసే వాడినని సందీప్ చెప్పుకొచ్చాడు. వాడు సిల్లీ రీజన్స్ చెప్తున్నాడని అన్నాడు. రతిక బాధపడుతూ కూర్చుంటే శివాజీ వచ్చి ఏమైందని అడిగాడు. ఎందుకో మైండ్ ఆఫ్ అయ్యిందని ఎమోషనల్ అవుతుంది.


ఇక శుభశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎవరి గురించో మాట్లాడింది. తన ముందు ఒకలా మాట్లాడి ఇప్పుడు శివన్న ముందు ఇలా మాట్లాడుతుంది ఏంటి రతిక అనేసి ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక ఏడుస్తున్న రతిక దగ్గరకి వచ్చిన ప్రశాంత్ బిస్కెట్లు వేయడం మొదలుపెట్టేశాడు. ఏంటి నువ్వు ఏడుస్తుంటే నీళ్ళు కాకుండా పాలు వస్తున్నాయి. పాల సముద్రం దాచి పెట్టావా ఏంటి అనేసరికి రతిక నవ్వేసింది. తనకి తోడు యావర్ కూడా కోతిలా ఎగురుతూ ఆమెని నవ్వించాడు.


నామినేషన్లో ఉన్న సభ్యులు.. 


నామినేషన్స్ ముగిసే సమయానికి శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, దామిని, యావర్, రతిక, టేస్టీ తేజ లిస్ట్‌లో ఉన్నారు. కానీ అక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రాలు ఉన్నాయి కాబట్టి.. వారిద్దరూ కలిసి ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు. సేఫ్ జోన్‌లో ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేయవచ్చు అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న తేజను సేవ్ చేసి అమర్‌దీప్‌ను నామినేట్ చేశారు సందీప్, శివాజీ. పవర్ అస్త్రా కోసం అవకాశం ఇచ్చినా కూడా అమర్‌దీప్ ఓడిపోయాడని కారణం చెప్పాడు సందీప్. దానికి ఇద్దరు కలిసి టార్గెట్ చేసినట్టుగా ఉందని అమర్‌దీప్ వ్యాఖ్యలు చేశాడు.


Also Read: దామినితో ‘డ్రామా’ గొడవ - పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన ప్రిన్స్ యావర్