బిగ్ బాస్ అంటే గొడవలు, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు గ్రూప్స్, గాసిప్స్ కూడా. ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో కచ్చితంగా ఒక లవ్ బర్డ్స్ కపుల్ ఉంటారు. ఇక బిస్ బాస్ సీజన్ 7లో చాలామంది యూత్ ఉండడంతో ఈసారి ఆ కపుల్ ఎవరు అని అనుమానాలు మొదటినుండే ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే అప్పుడే బిగ్ బాస్ హౌజ్‌లో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ అని, తనకు పెయిర్ అయ్యే వంటలక్క.. శోభా శెట్టినే అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. ఈ గాసిప్‌ను స్వయంగా బిగ్ బాస్‌తో కూడా షేర్ చేసుకున్నారు కొందరు కంటెస్టెంట్స్.


సంకెళ్లతో మొదలయ్యింది..
బిగ్ బాస్ సీజన్ 7లో కొందరు కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వకముందే.. నాగార్జున వారికి ఒక టాస్క్ ఇచ్చారు. అదే విధంగా డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణకు కూడా సంకెళ్లు వేసి హౌజ్‌లోకి వెళ్లగానే తనకు ఏ అమ్మాయి క్యూట్‌గా అనిపిస్తుందో.. తనను ఒప్పించి తనకు కూడా సంకెళ్లు వేయాలని నాగార్జున అన్నారు. కానీ మొదటిరోజే సంకెళ్లతో రావడంతో కనీసం గౌతమ్ కృష్ణకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా కంటెస్టెంట్స్ భయపడ్డారు. శుభశ్రీ మాత్రం గౌతమ్ చెప్పింది నమ్మి సంకెళ్లు వేయించుకుంది. కాసేపటి వరకు వారిద్దరూ అలా సంకెళ్లతో కలిసే ఉన్నారు. దీంతో వారిద్దరూ ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం దొరికింది. అలా వారు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంతలోనే నామినేషన్స్ రూపంలో ఒక ట్విస్ట్ వచ్చింది.


ముక్కుసూటి సమాధానలిచ్చిన షకీలా..
గౌతమ్ కృష్ణతో బాండింగ్ ఏర్పడలేదు అంటూ శోభ శెట్టి తనను నామినేట్ చేసింది. దానివల్ల వారిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టడం కోసం గౌతమ్.. పదే పదే శోభ వెంటతిరిగాడు. అలా మనస్పర్థలు దూరమయిపోయి వారిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు వీరిద్దరినీ చూస్తుంటే వీరి మధ్య ఏదో ఉందంటూ కంటెస్టెంట్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి. నేడు (సెప్టెంబర్ 7న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో షకీలాను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్ బాస్.. ఏదైనా గాసిప్ చెప్పమన్నప్పుడు కూడా గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి మధ్య ఏదో ఉందని తనకు అనిపిస్తున్నట్టుగా చెప్పింది. పైగా హౌజ్‌లో ఎవరి రిలేషన్ ఫేక్ అనిపిస్తుంది అని అడిగితే.. తనతో పాటు అందరిదీ ఫేకే అంటూ ముక్కుసూటి సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా రతిక వల్ల ప్రశాంత్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడని, ఇదంతా కరెక్ట్ కాదని తనకు ఎవరైనా చెప్తే బాగుంటుందని అనిపిస్తుందని షకీలా.. చాలామంది ప్రేక్షకుల అభిప్రాయాన్ని బిగ్ బాస్ ముందు బయటపెట్టింది.


సీరియస్‌గా శుభశ్రీ..
షకీలా తర్వాత టేస్టీ తేజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు బిగ్ బాస్. టేస్టీ తేజ కూడా గాసిప్ గురించి అడిగినప్పుడు గౌతమ్ కృష్ణ ఒకసారి తనతో శోభా శెట్టి మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అని చెప్పాడని బయటపెట్టాడు. ఇదే విషయాన్ని బయటికి వచ్చిన శుభశ్రీకి కూడా చెప్పాడు. కానీ ఆ విషయం చెప్తున్నంతసేపు శుభశ్రీ సీరియస్‌గా చూస్తూ కూర్చుంది. బిగ్ బాస్ హౌజ్‌లో డాక్టర్ బాబు, వంటలక్క అంటూ గౌతమ్ కృష్ణకు, శోభా శెట్టికి పేర్లు పెట్టాడు తేజ.


Also Read: జైలుకైనా వెళ్తా, బిగ్ బాస్ హౌజ్ నుండి మాత్రం వెళ్లిపోతా: శివాజీ