బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటివరకు హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ముమైత్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో యాంకర్ శివ, అరియనా, తేజస్వి, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, స్రవంతి, బిందు మాధవిలు ఉన్నాయి. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో బిందు మాధవి ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉంది. 


ఆమెకి నలభై శాతం వరకు ఓటింగ్ జరిగిందని సమాచారం. గతవారం కంటే ఈ వారం ఆమె ఎక్కువ ఓటింగ్ సంపాదించింది. అఖిల్ యాంటీ ఫ్యాన్స్, అలానే బిందు మాధవి ఫాలోవర్స్ అందరూ ఓటింగ్ చేయడంతో ఓటింగ్ లో దూసుకుపోతుంది బిందు మాధవి. యాంకర్ శివకి కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. గడిచిన వారాలతో పోలిస్తే ఈ వారం అరియనాకు ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. 


ఇదే గనుక కంటిన్యూ అయితే ఆమె టాప్ 5లో కూడా రావడం కష్టమే. ఈ వారం నామినేషన్ లో తేజస్వి కూడా ఉంది. సీజన్ 2లో నెగెటివిటీని మూటగట్టుకున్న ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం గేమ్ బాగానే ఆడుతోంది. దీంతో ఆమెకి ఓట్లు బాగానే పడుతున్నాయి. ఈ వారం ఆమె సేఫ్ జోన్ లో ఉంది. ఇక మిగిలిన మిత్రాశర్మ, అనిల్ రాథోడ్, స్రవంతిల మధ్య ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. 


మిత్రాతో పోలిస్తే అనిల్ రాథోడ్, స్రవంతి ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారని సమాచారం. ఊహించిన విధంగా ఈ వారం స్రవంతి నామినేషన్స్ లోకి వచ్చింది. టాస్క్ ల పరంగా గానీ.. కంటెంట్ జెనరేట్ చేసే విషయంలో కానీ ఆమె చాలా వీక్ గా ఉంది. మరి అనిల్ రాథోడ్, స్రవంతి ఇద్దరిలోనే ఎలిమినేషన్ జరిగితే స్రవంతి ఎలిమినేట్ అవ్వక తప్పదనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి!


Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!


Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్