శనివారం నాడు బిగ్ బాస్ ఓటీటీలో చాలా ఆసక్తి విషయాలు చోటుచేసుకున్నాయి. ముందుగా బిగ్ బాస్ ఈ వారం బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్ లను ఎన్నుకోమని చెప్పగా.. అందరూ కలిసి నటరాజ్ మాస్టర్ ని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. మహేష్ విట్టాను వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. ఆ తరువాత హౌస్ లోకి గెస్ట్ లు వస్తున్నారని తెలిసి.. హౌస్ మేట్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. వారి ముందు ఎలాంటి స్కిట్ లు పెర్ఫార్మ్ చేయాలి..? ఏ బట్టలు వేసుకోవాలని డిస్కస్ చేసుకున్నారు.


 వరస్ట్ పెర్ఫార్మర్ అయిన మహేష్ విట్టా బిగ్ బాస్ చెప్పే వరకు జైల్లో ఉండాల్సిందే. గెస్ట్ లు వచ్చినప్పుడు కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇక కాసేపటికే నటి వర్ష బొల్లమా లగేజ్ బ్యాగ్ పట్టుకొని హౌస్ లోకి ఎంటర్ అయింది. తను హౌస్ లో కంటెస్టెంట్ గా వచ్చానని.. వారిని ఆటపట్టించే ప్రయత్నం చేసింది. కానీ హౌస్ మేట్స్ నమ్మలేదు. గేమ్ గురించి ఏమైనా చెప్పమని వర్షని అడిగితే.. దానికి ఆమె తేజస్వి కెప్టెన్సీ నచ్చిందని చెప్పింది. 


వర్ష వచ్చిన కాసేపటికే రాజ్ తరుణ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తమ సినిమా 'స్టాండప్ రాహుల్'ని ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. మార్చి 18న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా గురించి మాట్లాడడంతో పాటు హౌస్ మేట్స్ తో కొన్ని స్కిట్స్ చేయించారు. అందరిలో ఆర్జే చైతు బెస్ట్ ఎంటర్టైనర్ గా ఎన్నుకున్నారు. 


అలానే ఇకపై హౌస్ లో వారియర్స్, ఛాలెంజర్స్ అనే గ్రూప్ లు ఉండవని బిగ్ బాస్ చెప్పమన్నట్లు వర్ష వెల్లడించింది. దీన్ని బట్టి ఇకపై అందరూ సోలో గేమ్ ఆడుకోవాల్సిందే అని తెలుస్తోంది. కాసేపటి తరువాత వర్ష, రాజ్ తరుణ్ ఇద్దరూ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ టాస్క్ బాగా ఎంజో చేశారు. రెండు వారాల తరువాత కొత్త ముఖాలు చూశానంటూ తేజస్వి హ్యాపీ ఫీలైంది. 


Also Read: స్టార్ రైటర్ ఇలా అయిపోయారేంటి? ఏమైంది అసలు!


Also Read: బెస్ట్ పెర్ఫార్మర్ గా నటరాజ్ మాస్టర్, వరస్ట్ ఎవరంటే?