బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇక రెండు రోజుల పాటు జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో గెలిచి.. వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు, ఛాలెంజర్స్ టీమ్ నుంచి నలుగురు పోటీ పడ్డారు. ఫైనల్ గా ఈ టాస్క్ లో అనిల్ రాథోడ్ గెలిచి కెప్టెన్ గా నిలిచాడు. 


ఇదిలా ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ని బెస్ట్ పెర్ఫార్మర్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పారు. ఈ క్రమంలో అందరూ కలిసి నటరాజ్ మాస్టర్ ని బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. ఇక వరస్ట్ పెర్ఫార్మర్ ని ఎన్నుకునే సమయంలో కొన్ని ఆర్గ్యూమెంట్స్ జరిగాయి. చాలా మంది మహేష్ విట్టా పేరు చెప్పారు. అతడు టాస్క్ లో అగ్రెసివ్ అయ్యాడని రీజన్ చెప్పారు. 


అరియానా, తేజస్వి కూడా మహేష్ విట్టా పేరు చెప్పడంతో అతడు హర్ట్ అయ్యాడు. దీంతో వారిద్దరితో వాదించాడు. మరోపక్క అఖిల్.. బిందుని టార్గెట్ చేశాడు. ఆమె బిహేవియర్ చాలా చైల్డిష్ గా ఉందని అన్నాడు. మహేష్ విట్టా కూడా బిందు మాధవి పేరు చెప్పాడు. అయితే ఫైనల్ గా మాత్రం ఎక్కువ ఓట్లు మహేష్ విట్టాకి పడ్డాయి. దీంతో అతడిని వరస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ గా అనౌన్స్ చేశారు. 


ఈ విషయంలో మహేష్ బాగా హర్ట్ అయ్యాడు. నటరాజ్ మాస్టర్.. బిందు గురించి అంత బ్యాడ్ గా మాట్లాడి.. వరస్ట్ పెర్ఫార్మర్ అనేసరికి తనకు ఓటేశారని ఫీల్ అయ్యాడు మహేష్. తన టీమ్ వారియర్స్ కోసం గేమ్ ఆడితే అందరూ కలిసి తనకు వరస్ట్ పెర్ఫార్మర్ ట్యాగ్ ఇచ్చారంటూ బాధపడ్డాడు. ఓటింగ్ అనంతరం తేజస్వి.. అఖిల్, అజయ్ లతో మీటింగ్ పెట్టింది. వారియర్స్ టీమ్ లో యూనిటీ లేదని, కానీ ఛాలెంజర్స్ టీమ్ మాత్రం అందరూ కలిసి గేమ్ ఆడుతున్నారని చెప్పింది.