బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు మొదలై రెండో వారం పూర్తి కాబోతుంది. రెండు రోజులుగా హౌస్ లో స్మగ్లర్స్, పోలీసుల టాస్క్ జరుగుతోంది. మొదటి రౌండ్ లో ఛాలెంజర్స్ పోలీసులుగా వారియర్స్ స్మగ్లర్స్ గా వ్యవహరించారు. రెండో రౌండ్ లో రోల్స్ రివర్స్ అయ్యాయి. ఈ టాస్క్ లో వారియర్స్ ని ఛాలెంజర్స్ ఓడించడంతో.. వారి టీమ్ నుంచి నలుగురు సభ్యులను కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకోమని చెప్పారు బిగ్ బాస్. 

 

దీంతో ఛాలెంజర్స్ అందరూ డిస్కస్ చేసుకొని ఫైనల్ గా నలుగురు పేర్లు చెప్పారు. అయితే ఈ డిస్కషన్ లో మిత్రా శర్మ పేరు చెప్పలేదని ఆమె బాధ పడింది. వాష్ రూమ్ లో సరయుతో తన బాధ చెప్పుకొచ్చి ఇచ్చేసింది. ఒక్కసారి కూడా తన పేరు చెప్పలేదని.. వాళ్ల లిస్ట్ లో తను లాస్ట్ నెంబర్ అంటూ ఫీలైపోయింది. ఛాలెంజర్స్ అందరూ కలిసి శ్రీరాపాక, శివ, చైతు, అనిల్ లను ఎంపిక చేసుకున్నారు. 

 

వారియర్స్ టీమ్ ను అభినందిస్తూ.. ఇద్దరు సభ్యులను కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకోమని చెప్పారు. దీంతో వారియర్స్ టీమ్ డిస్కస్ చేసుకొని ఫైనల్ గా హమీద, అరియనా పేర్లు చెప్పారు. ఇదే సమయంలో నటరాజ్ మాస్టర్ తన టీమ్ తో చిన్న వాదన జరిగి బయటకు వచ్చేశారు. అలానే తేజస్వి.. తను ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి నెక్స్ట్ వీక్ చేస్తానని చెప్పింది. దీంతో వారియర్స్ పేర్లను ఫైనల్ చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది. 

 

ఫైనల్ గా ఛాలెంజర్స్ టీమ్ నుంచి నలుగురు, వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు. టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ నేలను టచ్ చేయకుండా.. తమ కంటైనర్స్ లో వాటర్ ని ఫిల్ చేయాలి. ఈ టాస్క్ లో ఒక్కొక్కరూ అవుట్ అవుతూ.. ఫైనల్ గా అనిల్, శివ నిలిచారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలిచారో కాసేపట్లో తెలుస్తుంది.