బిగ్ బాస్ ఓటీటీ తెలుగు రెండో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఏడుగురు వారియర్స్ టీమ్ నుంచి నామినేట్ అయితే.. నాలుగురు ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు ఉన్నారు. వీరందరిలో డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం ముగ్గురే అని తెలుస్తోంది. సీనియర్స్ లో నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలు డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ.. వారు సేఫ్ అయిపోవడం ఖాయమని తెలుస్తోంది. 


అఖిల్, అరియానా ఇద్దరూ కూడా వోటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. కాబట్టి వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు. యాంకర్ శివకి కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. అషురెడ్డి, హమీదలు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఈసారి సరయుకి కూడా ఓట్లు బాగా పడ్డాయట. ఛాలెంజర్స్ టీమ్ లో అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, శ్రీరాపాక డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


ఇప్పటివరకు జరిగిన అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే మాత్రం అనిల్ కంటే శ్రీరాపాక, మిత్రాశర్మ ఓటింగ్ లో వెనకబడ్డారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ వారం శ్రీరాపాకను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. నిజానికి ఆమె ఇప్పటివరకు తన గేమ్ మొదలుపెట్టలేదు. ఆమె హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అరియనాతో గొడవ పడుతూనే ఉంది. 


పోలీసులు, స్మగ్లర్స్ టాస్క్ లో కూడా వీరు గొడవ పడ్డారు. ఇక నామినేషన్ సమయంలో అయితే అరియానా ఓ రేంజ్ లో శ్రీరాపాకపై ఫైర్ అయింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అనిల్ రాథోడ్ విన్నర్ గా నిలిచాడు. అతడు గనుక ఈ వారం సేఫ్ అయితే మళ్లీ హౌస్ లో ఛాలెంజర్స్ ఆధిపత్య మొదలవుతుంది.