బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా.. గతవారం నామినేషన్స్ జరిగే సమయంలో హౌస్ మేట్స్ లో చాలా మంది రెచ్చిపోయారు. బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించారు. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి గట్టిగానే క్లాస్ పీకారు. 


దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ముందుగా అరియనాను చాలా స్టుపిడ్ గా బిహేవ్ చేశావని.. బిగ్ బాస్ హౌస్ అనేది లైఫ్ టైం ఆపర్చ్యునిటీ.. కానీ నువ్ చేసే పని వలన నీ లైఫ్ ని కూడా హర్ట్ చేయొచ్చని నాగార్జున అనగానే ఏడ్చేసింది అరియనా. ఆ తరువాత నామినేషన్స్ లో మిత్రాశర్మ తన చేతులను స్టాండ్ కి వేసి బాదుకోవడాన్ని తప్పుబడుతూ.. బయటకు వెళ్లి చేతులు విరగ్గొట్టుకో.. బిగ్ బాస్ హౌస్ లో కాదంటూ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. 


టాస్క్ లో ఎమోషనల్ అయిన నటరాజ్ మాస్టర్.. దేవుడా ఆడియన్స్ నన్ను టాప్ కి 5కి తీసుకెళ్లకపోతే నన్ను చంపేయ్ అనే డైలాగ్ వేశారు. దీనిపై ఫైర్ అయ్యారు నాగార్జున. అలానే బిందుని తిడుతూ ఆమె తండ్రి టాపిక్ ని తీసుకొచ్చిన నటరాజ్ మాస్టర్ ని గట్టిగా నిలదీశారు నాగార్జున. బిందు తండ్రిని అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు నాగ్. 


దీంతో నటరాజ్.. తన కూతురు టాపిక్ తీసుకురావడంతో అన్నానని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో నాగార్జున అసలు తగ్గలేదు. నటరాజ్ కి గట్టిగానే క్లాస్ పీకారు. షో అయిపోగానే బిందు చెన్నై వెళ్లిపోతుందని నటరాజ్ అనడాన్ని కూడా తప్పుబడుతూ.. ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని చెప్పారు నాగ్. దీంతో నటరాజ్ మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు చెప్పాడు.


ఇక బిందు.. నటరాజ్ మాస్టర్ ని నామినేషన్స్ లో 'రా..', 'తూ..' అని అనడంపై నాగార్జున కోప్పడ్డారు. దీంతో బిందు.. ఆయన అలా మాట్లాడడంతో కోపంతో చేశానని చెప్పగా.. 'ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది..?' అంటూ ప్రశ్నించారు. దీంతో బిందు సైలెంట్ అయిపోయింది.