టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు తమన్. ఇప్పుడు తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కెరీర్ ఆరంభం నుంచి తమన్ పై కాపీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తన ట్యూన్స్ ను తనే కాపీ చేస్తున్నాడనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాతో మరోసారి కాపీ విమర్శలను ఎదుర్కొంటున్నారు తమన్. 

 

'సర్కారు వారి పాట' సినిమాలో 'కళావతి' సాంగ్ చరణం విషయంలో తమన్ తన పాత బాణీల్నే రిపీట్ చేశాడనే కామెంట్స్ వస్తున్నాయి. అలానే ఈ సినిమాలో మాస్ సాంగ్.. 'మ మ మహేషా' సాంగ్ అయితే 'సరైనోడు' సినిమాలో సాంగ్ మాదిరి ఉందంటూ ట్రోల్ చేశారు నెటిజన్లు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ కాపీ విమర్శలపై స్పందించారు తమన్. 

 

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. కాపీ ట్యూన్స్ పై స్పందిస్తూ.. ఫ్లోలో అలా జరిగి ఉండొచ్చని అన్నారు. ఏదైనా కాపీ కొట్టినట్లు అనిపిస్తే అందరికంటే ముందు తన టీమ్ రెస్పాండ్ అవుతుందని.. తనకు 14 మంది సభ్యుల టీమ్ ఉందని అన్నారు. కాపీ కొడితే చెప్పేసే మంచి యాప్స్ కూడా తమ దగ్గర ఉన్నాయని అన్నారు. కాపీ కొడుతున్నామనే ఫీలింగ్ తో పనిచేయలేదని.. మేమంతా ఫ్రెష్ గానే వర్క్ చేశామని చెప్పారు. 

 

ట్యూన్ ని రిపీట్ చేశాననే విషయం జనం చెబితే తప్ప తనకు తెలియలేదని.. కంపోజ్ చేసే టైమ్ లో కాపీ కొడుతున్నామని మాకు తెలియదని.. ఫ్లోలో పనిచేసుకుంటూ వెళ్లిపోయామని చెప్పుకొచ్చారు. సొంత ట్యూన్ ను కాపీ కొట్టానని  అంటున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడడం లేదని తెలిపారు.