బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఏడు వారాలను పూర్తి చేసుకొని ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో మహేష్ విట్టా ఎలిమినేట్ కాగా.. సోమవారం నాడు నామినేషన్స్ షురూ చేశారు బిగ్ బాస్. ఇందులో అజయ్.. ముందుగా అనిల్, హమీదలను టాస్క్ లో బిహేవియర్ బాలేదని నామినేట్ చేశాడు. ఆ తరువాత అరియనా.. అషురెడ్డి, అఖిల్ లను నామినేట్ చేసింది. ఈ విషయంలో అరియానాకు వారిద్దరితో మాటల యుద్ధం జరిగింది. అరియానా అసలు గేమ్ ఆడడం లేదని.. బిగ్ బాస్ హౌస్ కి వెకేషన్ కి వచ్చిందని అషురెడ్డి స్టేట్మెంట్ పాస్ చేసింది. 

 

నటరాజ్ మాస్టర్, అజయ్ లను నామినేట్ చేశాడు అనిల్. అజయ్, అషురెడ్డిలను హమీద నామినేట్ చేయడంతో ఇద్దరూ ఆమెపై ఫైర్ అయ్యారు. 'హమీద నీ మెంటల్ స్టేటస్ బాగానే ఉందా..?' అంటూ అషురెడ్డి అడగడంతో హమీదకు కోపమొచ్చింది. ఆ తరువాత అఖిల్.. అరియనాను నామినేట్ చేస్తూ తను గేమ్ ఆడడం లేదని అనడంతో ఆమె వెటకారంగా కామెంట్స్ చేసింది. ఎప్పటిలానే బిందుని నామినేట్ చేశాడు అఖిల్. దీంతో ఇద్దరూ మళ్లీ తిట్టుకున్నారు. స్రవంతిని ఎమోషనల్ గా వాడుకున్నావ్ అంటూ అఖిల్ ని తిట్టిపోసింది బిందు. దీంతో అఖిల్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. 

 

నటరాజ్ మాస్టర్.. అనిల్, హమీదలను నామినేట్ చేశాడు. ఈ విషయంలో హమీద, నటరాజ్ చాలాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు. మిత్రాశర్మ.. అషురెడ్డి, బిందు మాధవిలను నామినేట్ చేసింది. స్రవంతి టాపిక్ తీసుకురావొద్దని బిందుకి చెప్పగా.. ఇద్దరూ కాసేపు తిట్టుకున్నారు. అనంతరం అషురెడ్డి.. మిత్రాశర్మ, హమీదలను నామినేట్ చేసింది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ను మొత్తం సీక్రెట్ రూమ్ నుంచి చూస్తున్న బాబా మాస్టర్ కి తలనొప్పి వచ్చి జండూబామ్ రాసుకున్నారు. 

 

ఇక బిందు మాధవి.. అఖిల్ ని నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత అజయ్ ని నామినేట్ చేసింది. చివరిగా శివ.. అషురెడ్డి, అఖిల్ లను నామినేట్ చేశాడు. ఈ వారం నామినేట్ అయిన సభ్యులెవరంటే.. అఖిల్, అషురెడ్డి, బిందు మాధవి, అనిల్, హమీద, అజయ్. అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న బాబా భాస్కర్ కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. నామినేట్ అయిన ఆరుగురి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేయాలని చెప్పారు. దీంతో అతడు బిందుమాధవి పేరు చెప్పారు. సో.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది.. అఖిల్, అషురెడ్డి, అనిల్, హమీద, అజయ్.