బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరోవరంలోకి ఎంటర్ అయింది. నిన్నటి ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ జరగగా.. ముమైత్ ఖాన్, స్రవంతి హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని ఇద్దరు చొప్పున పిలుస్తూ.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో ముందుగా హమీద, అనిల్ లను పిలిచారు. 


వీరిద్దరూ డిస్కస్ చేసుకొని ఫైనల్ గా అనిల్ నామినేట్ అవుతున్నట్లు చెప్పాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్, శివలను పిలవగా.. వారిద్దరి మధ్య పెద్ద గొడవా జరిగింది. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇద్దరూ నామినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు బిగ్ బాస్. అనంతరం మహేష్, మిత్రాలను పిలిచారు. మిత్రా.. మహేష్ కోసం సాక్రిఫైస్ చేస్తూ నామినేట్ అయింది. 


ఆ తరువాత బిందు మాధవి, అఖిల్ లను పిలిచారు బిగ్ బాస్. కోపం ఎక్కువ అనే కారణంతో బిందు మాధవిని నామినేట్ చేస్తున్నట్టుగా అఖిల్ చెప్పుకొచ్చాడు. గత వారం కూడా అదే కారణంతో చేశాను అని అన్నాడు. బిందు మాధవి కూడా వాదించడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. రేయ్ అఖిల్‌గా చెప్పురా? అని బిందు మాధవి సెటైరికల్‌గా అంటే.. ఒసేయ్.. ఏం చెప్పాలే బిందు అని అఖిల్ మరింతగా రెచ్చిపోయాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇద్దరూ నామినేట్ అయ్యారు. అరియనా-అజయ్ లలో అరియనా నామినేట్ అయింది. 


ఫైనల్ గా కెప్టెన్ అషురెడ్డికి స్పెషల్ పవర్ ఇస్తూ.. సేవ్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. దీంతో ఆమె మహేష్ పేరు చెప్పింది. అషురెడ్డి ఇచ్చిన సిల్లీ రీజన్ అతడికి నచ్చకపోవడంతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.


ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. అఖిల్, బిందుమాధవి, శివ, నటరాజ్ మాస్టర్, అరియనా, మిత్రా శర్మ, అనిల్, మహేష్. 


Also Read: ఎయిర్‌పోర్టులో నటికి వేధింపులు - అసభ్యంగా తాకుతూ!