బిగ్ బాస్ నాన్ స్టాప్ షో నుంచి ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటివరకు మహేష్ విట్టా, స్రవంతి, ముమైత్ ఖాన్, తేజస్వి, సరయు, ఆర్జే చైతు, శ్రీరాపాక వంటి వారు ఎలిమినేట్ కాగా.. ఈ వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. కానీ బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గేమ్ మారిపోయింది. ఆయన తనకిచ్చిన స్పెషల్ పవర్ తో బిందు మాధవిని నామినేషన్ నుంచి తప్పించాడు. 


దీంతో అనిల్, అఖిల్, అజయ్, అషురెడ్డి, హమీద నామినేషన్ లోకి వచ్చారు. ఆదివారం నాడు షోలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ముందుగా అనిల్ ని సేవ్ చేశారు. ఆ తరువాత హమీదను సేవ్ చేశారు. కాసేపు హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించిన నాగార్జున.. చివరి వరకు అఖిల్, అషురెడ్డి, అజయ్ లను నామినేషన్ లోనే ఉంచి కాస్త టెన్షన్ పెంచారు. కాసేపటికి అఖిల్ ని సేవ్ చేశారు. 


ఫైనల్ గా అషురెడ్డి, అజయ్ లలో అజయ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో అఖిల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రాశర్మ కూడా బాధ పడింది. స్టేజ్ పైకి వెళ్లిన అజయ్ తనకు నచ్చిన వారికి హార్ట్ సింబల్స్, నచ్చని వారికి హార్ట్ బ్రేక్ సింబల్స్ ఇచ్చాడు. వెళ్తూ వెళ్తూ అఖిల్ ని కప్పుతో బయటకు రావాలని చెప్పాడు. 


Also Read: 'హరిహర వీరమల్లు' - ఏ పండక్కి వస్తుందో?