బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ ముగిసింది. ఇక మళ్ళీ పవర్ అస్త్ర టాస్క్ కంటిన్యూ చేశాడు బిగ్ బాస్. అందుకోసం గాను ఇంటిని బిగ్ బ్యాంక్ గా మార్చేశాడు. ఇప్పటి వరకు సందీప్, శివాజీ, శోభా శెట్టి ముగ్గురు మూడు పవర్ అస్త్రలు గెలుచుకుని నామినేషన్స్ లో లేకుండా వచ్చారు. తాజాగా బిగ్ బాస్ నాలుగో పవర్ అస్త్రకి సంబంధించి టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటలో భాగంలో యావర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.


ఈ వారం బిగ్ బాస్ ఇల్లు బ్యాంక్ గా మారింది. సందీప్, శివాజీ, శోభా శెట్టి బ్యాంకర్లుగా వ్యవహరిస్తారు. మిగతా వాళ్ళకి పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు అవకాశం ఇచ్చారు. మీ దగ్గరున్న కాయిన్స్ పెంచుకోవడానికి ప్రత్యర్థులను ఓడించాల్సి ఉంటుంది. ఆట ముగిసే సమయానికి ఏ కంటెస్టెంట్ దగ్గర ఎక్కువ సేఫ్ డిపాజిట్స్ ఉంటాయో వాళ్ళు నాలుగో పవర్ అస్త్ర కంటెండర్ గా నిలుస్తారని బిగ్ బాస్ పోటీ పెట్టాడు. బిగ్ బ్యాంక్ దగ్గర కాయిన్స్ తీసుకోవడం కోసం అందరూ ఒక్కసారిగా పరుగులు పెడతారు. ఈ తోపులాటలో యావర్ కిందపడిపోయాడు, ప్రశాంత్ కంటికి కూడా దెబ్బ తగిలినట్టుగా చేయి అడ్డం పెట్టుకుని పక్కకి వెళ్ళినట్టు ప్రోమోలో కనిపించింది. అయితే ముందుగా బజర్ నొక్కింది నేను అంటే నేను అని అమర్ దీప్, శుభశ్రీ వాదించుకున్నారు. అమర్ దీప్ ముందుగా తనే బజర్ ప్రెస్ చేశానంటూ గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఏమైందో ఏమో అప్పటి వరకు బాగానే ఉన్న యావర్ ఒక్కసారిగా కిందపడి నొప్పితో విలవిల్లాడుతూ కనిపించాడు. యావర్ కి ఏమైంది, ఎవరు ముందుగా బజర్ ప్రెస్ చేశారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Also Read: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది


రెండు రోజులుగా బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ పర్వం జరిగింది. నామినేషన్స్ ప్రక్రియని జడ్జిలుగా శివాజీ, సందీప్, శోభా శెట్టి నిలిచారు. ఈసారి కంటెస్టెంట్స్‌లో ఎవరు నామినేట్ అవ్వాలి అనే విషయాన్ని సగం వరకు కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తే.. దాని తుది నిర్ణయం ఈ జడ్జిల చేతిలో ఉంది. ఎంత జడ్జిలు అయినా కూడా కొన్నిసార్లు వారి నిర్ణయం కూడా తప్పు అయ్యే అవకాశం ఉంది. గౌతమ్ కృష్ణ విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు బాగానే జరిగాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్ గా కనిపించిన రతిక, పల్లవి ప్రశాంత్ మళ్ళీ తిట్టుకున్నారు. అమర్ దీప్ ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ బిహేవ్ చేశాడు.  


తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు అమర్‌దీప్. అప్పుడు తనకు సంబంధం లేకపోయినా మధ్యలో మాట్లాడి ప్రశాంత్‌కు రెండు మొహాలు ఉన్నాయి అని నిరూపించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్న సమయంలో కూడా రతిక జోక్యం చేసుకొని గొడవను పూర్తిగా తనవైపుకు తిప్పుకుంది.