'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 కోసం స్టార్ మా సరికొత్త ప్లాన్స్ చేస్తోంది. వెరైటీగా ఈసారి సామాన్యులకు షోలో అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 'బిగ్ బాస్ 9' అగ్నిపరీక్ష పేరుతో మరో షో చేస్తున్నారు. దానికోసం స్పెషల్‌గా ఒక హౌస్ సెట్ వేశారు. 'బిగ్ బాస్' మెయిన్ షో ఆ హౌస్‌లో ఉండదు. అందుకు వేరేగా మరో హౌస్ సెట్ రెడీ చేశారు. ఈ హౌస్ థీమ్ ఏంటో తెలుసా?
నవగ్రహాలు థీమ్‌తో 'బిగ్ బాస్ 9' హౌస్!Bigg Boss 9 Telugu House Theme Revealed: ప్రతి సీజన్ కోసం ఒక థీమ్ బేస్ చేసుకుని 'బిగ్ బాస్' హౌస్ రెడీ చేస్తారు. ఈసారి డివోషనల్ థీమ్ సెలెక్ట్ చేశారని తెలిసింది. నవ గ్రహాల థీమ్ ప్రకారం 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 హౌస్ రెడీ చేశారట.
Also Read: ట్రాన్స్ మహిళ అంకితకు కమ్యూనిటీ వెన్నుపోటు... బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వెనక్కి!
హిందూ సంప్రదాయంలో, జ్యోతిష్యంలో నవ గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్య చంద్రులతో పాటు అంగారకుడు, శుక్ర - శని, రాహు - కేతువులకు, బుధుడు, గురువు ప్రభావం మనిషి మీద ఉందని చెబుతారు. ఇప్పుడు ఆ గ్రహాలను ఆధారం చేసుకుని 'బిగ్ బాస్' హౌస్ రెడీ అయ్యింది. మరి ఆట (టాస్క్)ల్లోనూ వాటికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారేమో చూడాలి.
'బిగ్ బాస్ 9' మొదలు అయ్యేది ఎప్పుడు?'బిగ్ బాస్ 9' షో ఎప్పుడు మొదలు అవుతుంది? అంటే... దానికి ముందు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి. ఆగస్టు 22 లేదా 23వ తేదీల్లో 'బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష'ను వీక్షకులకు చూపించేందుకు స్టార్ మా టీమ్ రెడీ అవుతోంది. ఈ షో టీవీలో రాదు. కేవలం ఓటీటీ ఆడియన్స్ కోసం జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అది ప్రసారమైన రెండు వారాలకు, సెప్టెంబర్ మొదటి వారంలో 'బిగ్ బాస్ 9' స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్ష' వీడియోలు లీక్... ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? బిందు మాధవి అస్సలు తగ్గట్లేదు