బిగ్ బాస్ డే 54లో పర్మనెంట్ హౌస్ మేట్స్ అవ్వడానికి పోరాడుతున్న శ్రీజ దమ్ము, భరణి లకు ఫైనల్ డెసిషన్ ఇచ్చారు బిగ్ బాస్. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అర్ధరాత్రి దువ్వాడ మాధురి, తనూజా, దివ్య కలిసి శ్రీజ తీరు గురించి గుసగుసలు పెట్టారు. ఉదయాన్నే దువ్వాడ మాధురి పడుకోవడంతో బిగ్ బాస్ కుక్కల అరుపులతో నిద్ర లేపాడు. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ పనిష్మెంట్ గా ఆమెతో 20 గుంజిళ్ళు తీయించాడు. ఒక్కసారి కాదు బాత్రూమ్ లో ఓసారి, మరోసారి బెడ్ పై నిద్రపోయింది.
శ్రీజ దమ్ము అవుట్మధ్యాహ్నం సమయానికి భరణి, శ్రీజలకు ప్రేక్షకుల ఓట్లపై ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని ప్రకటించారు బిగ్ బాస్. ఇద్దరూ బాక్సులు బద్దలు కొట్టగా, భరణికి హౌస్ లో స్థానం దక్కింది. శ్రీజ మరోసారి ఎగ్జిట్ అవ్వక తప్పలేదు. తనకు ఓట్లేసిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు భరణి. సాయంత్రం ప్రేక్షకుల తీర్పుతో పర్మనెంట్ హౌస్ మేట్ గా నిలిచిన భరణికి కెప్టెన్సీలో పోటీపడే 5 మంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే పవర్ ను బిగ్ బాస్ ఇచ్చారు. ఆయన సాయి శ్రీనివాస్, దివ్య, తనూజా, నిఖిల్ లతో పాటు తన పేరు కూడా ఈ లిస్ట్ లో పెట్టాడు.
తనూజా వర్సెస్ కళ్యాణ్... కూరగాయల రచ్చబెండకాయ - ఆలూ కర్రి గురించి కళ్యాణ్ - తనూజా మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కళ్యాణ్ ఆలూ కర్రీ వండమంటే, బెండకాయలు పాడవుతున్నాయి అదే చేస్తానని పట్టుబట్టింది తనూజా. మరోవైపు టీ కోసం దివ్య, రీతూ మధ్య ఇంకో గొడవ చోటు చేసుకుంది. సాయంత్రం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అవ్వడానికి 'డీజే కెప్టెన్' అనే టాస్క్ ఇచ్చారు. కంటెండర్లు ఒక్కొక్కరుగా పాటలకు ఒక స్టేజ్ పై డ్యాన్స్ వేయాలి. ఒకవేళ కంటెండర్ కు సపోర్ట్ చేయాలి అనుకునేవారు పక్కనున్న ప్లాట్ ఫాంపై డ్యాన్స్ చేయాలి. వద్దు అనుకున్న వాళ్ళు వాళ్ళను కిందకు దించేయవచ్చు. ఈ టాస్క్ లో చివరకు దివ్య వర్సెస్ తనూజా మిగిలారు.
రామూ అన్ ఫెయిర్ డెసిషన్టాస్క్ జరుగుతుండగానే సాయి భరణిని ఎన్ని మాట్లాన్నాడో అన్నీ చెప్పేసింది మాధురి. "ఇలాంటి వాడిని ఎందుకు కంటెండర్ గా చేశారు?" అని ముఖం పట్టుకుని అడిగేసింది. "మీరెందుకు నాకు సపోర్ట్ చెయ్యట్లేదు. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలియాలంటే స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయండి" అని అడిగాడు భరణి. ఆమె కూడా ఒప్పుకుంది. ఇక కెప్టెన్సీ టాస్క్ లోనే తనూజా తాను సపోర్ట్ చేసినా కూడా సాయి తనకు హెల్ప్ చేయలేదని ఫైర్ అయ్యింది. "చివరిదాకా వచ్చి ఆగిపోతున్నా" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. "డబుల్ స్టాండ్" అనే అవార్డును సాయికి ఇవ్వొచ్చు అని మండిపడింది. సంచాలక్ గా ఉన్న రామూ అన్ ఫెయిర్ డెసిషన్ తో దివ్యను విన్నర్ గా అనౌన్స్ చేశాడు. ఇక బిగ్ బాస్ 9లో 8వ కెప్టెన్ గా నిలిచిన దివ్య తన ఫోటోను భరణి చేత స్టాండ్ లో పెట్టించింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ డెన్ అనే కొత్త ప్లేస్ ను ఓపెన్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు.