బిగ్ బాస్ డే 53 లో హౌస్ మేట్స్ మధ్య ఫుడ్ వార్ తో పాటు పవర్ బ్యాటిల్ కూడా నడిచింది. ఉదయాన్నే సంజన, మాధురి , శ్రీజ, రామూ, సాయి, కళ్యాణ్ కలిసి కూర్చుని ఫుడ్ సరిపోలేదని రేషన్ మేనేజర్ తనూజాపై కంప్లైంట్ చేశారు. "క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఆశలు పెట్టొద్దు అని చెప్పు" అంటూ క్లారిటీ ఇచ్చింది తనూజా. అంతలోపు "రెండు చపాతీలు అన్నప్పుడు ముందే చెప్పాల్సింది" అని కళ్యాణ్ పాయింట్ రెయిజ్ చేయగా, "ఇన్ని రోజులు ఏదన్నా పాయింట్ ఉంటే డైరెక్ట్ గా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఏదో గొడవ అన్నట్టుగా మాట్లాడుతున్నారు" అంటూ మాధురి దగ్గరకు వెళ్ళింది. వంట చేయమని మాధురిని అడిగితే... "నువ్వు ప్రతిదానికి అరుస్తున్నావు. ఆకలేసింది పిండి కలుపుకుంటా అని అడిగినా అరిచావ్. నావల్ల కాదు" అంటూ చేతులెత్తేసింది. "2 చపాతీలు సరిపోలేదు అని ఎవరు కంప్లైంట్ చేశారు?" అని దివ్య ఇమ్మాన్యుయేల్ ను అడిగింది. "ఒక్కొక్కరికి ఒక్కోలా అంటే అవ్వదు. రాత్రి పడుకునేటప్పుడు వచ్చి రైస్ పెట్టమంటే ఎలా పెడతాను?" అనే ప్రశ్నను లేవనెత్తింది తనూజా. ఈ విషయాలన్నీ కళ్యాణ్ చాటుగా వింటూ వచ్చాడు.
"రేస్ ఆఫ్ మేజ్" టాస్క్ లో భరణి విన్ మాధురి చిరాగ్గా ఉంది అంటూ ఫుడ్ మీద అలిగింది. "ఆమె తింటదా లేదా అనేది నాకనవసరం. ఆమె ప్లేట్ ఆమెకు ఇవ్వు" అని దివ్యకు పురమాయించింది తనూజా. ఇదే ఫుడ్ విషయంలో తనూజా - కళ్యాణ్ మధ్య గొడవ చిన్న జరిగింది. ఈ గొడవలన్నీ అయ్యాక రీతూ, డెమోన్ మధ్య సినిమా స్టైల్ లో లవ్ స్టోరీతో ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు ఇమ్మాన్యుయేల్. మధ్యాహ్నం సమయానికి బిగ్ బాస్ "రేస్ ఆఫ్ మేజ్" టాస్క్ ఇచ్చారు. ఇందులో శ్రీజ, భరణి తరపున దివ్య ఆడగా, దివ్య విన్ అయ్యింది.
కర్రీ ఎక్స్ట్రా ఉందా? అని శ్రీజ రెండుసార్లు అడిగాక అక్కడే ఉన్న తనూజా సమాధానం చెప్పలేదు. దీంతో దివ్య ఆన్సర్ ఇచ్చింది. "పర్మనెంట్ హౌస్ మేట్ ను కాదని అంత ఆటిట్యూడ్ చూపించొద్దు" అంటూ ఫైర్ అయ్యింది శ్రీజ. "నాకంటూ ఒక పేరుంది కదా. ఇక్కడెవరూ పని మనుషులు లేరు. మిమ్మల్ని బట్టి నా బిహేవియర్ ఉంటుంది" అంటూ దివ్య దగ్గర ఓపెన్ అయ్యింది తనూజా. "కూర్చుని మాట్లాడితే సెట్ అవుతుంది" అంటూ తనూజా - మాధురి మధ్య తగవును తీర్చే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు ఇమ్మూ. కానీ దువ్వాడ మాధురికి అన్నం తినిపించడంలో సక్సెస్ అయ్యాడు.
కళ్యాణ్ మిస్టేక్ - డెమోన్, శ్రీజ వార్ సాయంత్రం "రిలీజ్ ద వారియర్" అనే టాస్క్ పెట్టారు. ఈ టన్నెల్ టాస్క్ లో రెండు టీమ్స్ లో నుంచి ఒక్కొక్కరు జైల్లో ఉండి, మరొకరు తెచ్చే బ్లాక్స్ తో జిగ్సా ఫజిల్ ను పేర్చాలి. ఇందులో భరణి తరపున రామూ ఆడగా, శ్రీజా తరపున కళ్యాణ్ ఆడాడు. శ్రీజ టీం విన్ అయ్యింది. చివరగా "రైట్ కలర్ రైట్ కనెక్షన్" అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భరణి తరపున ఇమ్మాన్యుయేల్, శ్రీజ తరపున కళ్యాణ్ ఆడగా, భరణి టీం విన్ అయ్యింది. కళ్యాణ్ చేసిన చిన్న తప్పిదం వల్ల డెమోన్ - శ్రీజ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎపిసోడ్ చివర్లో తనూజా - దువ్వాడ మాధురి ఇద్దరూ గొడవలన్నీ పక్కన పెట్టేసి నవ్వుకున్నారు. వీళ్ళ బాండింగ్ చూసి ఇమ్మాన్యుయేల్ షాక్ అయ్యాడు.