బిగ్ బాస్ డే 52 ఎపిసోడ్ 53లో పర్మనెంట్ హౌస్ మేట్స్ అవ్వడానికి, రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి భరణి, శ్రీజ కొందరిని సైనికులుగా సెలెక్ట్ చేసుకుని, ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి కోటలో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించారు. "కట్టు పడగొట్టు" అంటూ బ్లాక్స్ తో 7 అంతస్తుల టవర్ ను నిర్మించే టాస్క్ ఇచ్చారు. దీనికి హౌస్ మేట్స్ లో భరణికి ఇమ్మాన్యుయేల్ - నిఖిల్, శ్రీజకు డెమోన్ - గౌరవ్ సపోర్ట్ గా ఆడారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఫిజికల్ గా టఫ్ గా ఆడారు. కానీ చివర్లో ఇద్దరూ బాక్స్ లో బ్లాక్స్ ను పూర్తిగా పెట్టలేకపోవడం అన్నది గందరగోళానికి దారి తీసింది. సంచాలక్ లు సుమన్ శెట్టి, కళ్యాణ్ పడాల ఇద్దరూ ఓ నిర్ణయానికి రాలేకపోవడం కారణంగా 'ఫెయిల్ అయ్యారు' అంటూ ఇద్దరినీ తీసేసి, మాధురిని సంచాలక్ గా నిర్ణయించారు బిగ్ బాస్. అప్పటిదాకా భరణి టీంకు సపోర్ట్ చేసిన మాధురి... శ్రీజ టీం విన్ అంటూ ప్లేటు తిప్పేసింది. 

Continues below advertisement

తినే అన్నం దగ్గర నుంచి టీ దాకా గొడవలే గొడవలు ఆ తరువాత రైస్ రచ్చ మొదలెట్టింది తనూజా. రీతూను మిగిలిన అన్నం తినేయమని దివ్య చెప్పడంతో "నువ్వెలా చెప్తావ్" అంటూ తనూజా ఫైర్ అయ్యింది. మరోవైపు రామూ, కళ్యాణ్ మధ్య స్ట్రాంగ్ గా మాటల యుద్ధం నడిచింది. "సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు" అంటూ అరిచాడు రామూ. తరువాత ఇద్దరూ కూల్ గా మాట్లాడుకున్నారు. కళ్యాణ్ తను చేసిన తప్పుకు సారీ చెప్పాడు. సెకండ్ రౌండ్ లో టాస్క్ మరింత ఫిజికల్ కావడంతో భరణికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని మెడికల్ రూమ్ కి పిలిచి పరీక్షించారు. పడుకుని లేచేటప్పుడు అన్ కంఫర్ట్ గా ఉందని చెప్పడంతో భరణిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం కోసం బయటకు పంపారు. 

భగ్గుమన్న బాండింగ్స్ డెమోన్ కు "చపాతీ లావుగా వస్తోంది" అని కంప్లయింట్ అయ్యింది తనూజా. దీంతో "మేమేమన్నా హోటల్లో పని చేసి వచ్చామా చపాతీ సన్నగా, లావుగా చేయడానికి? అరిస్తే కాదు ప్రేమతో తగ్గుతారు అని తెలుసుకో. మీకు సపోర్ట్ గా ఉంటే నచ్చుతుంది. న్యాయంగా ఉంటే నచ్చదు" అంటూ దువ్వాడ మాధురి మండిపడింది. అయితే మధ్యలో 'నాన్న గేమ్ గురించి ఎందుకు వచ్చింది? ఎక్కడిది అక్కడే మాట్లాడితే బెటర్" అని ఇచ్చిపడేసింది తనూజా. కెప్టెన్ తనూజా అయితే ఎలా ఉంటుందో చూడాలని డెమోన్ అడగ్గా... "రేషన్ మేనేజర్ అయితేనే తట్టుకోలేకపోతున్నాము" అని సెటైర్ వేసింది దివ్య. ఆ తరువాత కామెడిగా చేసిన ఉల్లిపాయ గందరగోళంలో "హౌస్ మేట్స్ చెప్పింది వినకపోతే తల పగలగొట్టుకుంటా" అని వార్నింగ్ ఇచ్చాడు ఇమ్మూ. ఇంత రచ్చ అయ్యాక హౌస్ మేట్స్ గురించి సుమన్ శెట్టి ఇన్నర్, ఔటర్ వాయిస్ ను ఇచ్చి ఇమ్మాన్యుయేల్ తెగ నవ్వించాడు.

Continues below advertisement

Also Read: బిగ్‌ బాస్ డే 51 రివ్యూ... శ్రీజ దమ్ము ధాటికి దువ్వాడ మాధురి డీలా... సంజనాకు ఇచ్చిపడేసిన భరణి... ఈ వారం నామినేటెడ్ కంటెస్టెంట్లు వీళ్ళే

గౌరవ్ బ్లాక్ టీ అడగడంతో "నేను చేయను" అంటూ దివ్య మరో గొడవ స్టార్ట్ చేసింది. "భరణి విషయంలో కూడా ఇలాగే ఇన్వాల్వ్ అవుతావు" అంటూ గౌరవ్ దాన్ని మరింత పెద్దది చేశాడు. మాధురి నామినేషన్ లో అన్ని మాటలు అన్నా డెమోన్ స్టాండ్ తీసుకోలేదని రీతూ చౌదరి మళ్ళీ శ్రీజ ముందు పంచాయతీ పెట్టింది. ఈ గొడవ తారాస్తాయికి  చేరింది. కానీ చివరికి ఇద్దరూ కూల్ అయ్యారు. చెప్పకుండా అన్నం పెట్టుకున్నందుకు సంజనాను తనూజా ప్రశ్నించడం మరో గొడవకు దారి తీసింది. ఎపిసోడ్ ఎండింగ్ లో భరణి రీఎంట్రీతో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 

Also Readబిగ్‌బాస్ డే 49 రివ్యూ... కళ్యాణ్ వేషాలు... రీతూపై పచ్చళ్ల పాప రివేంజ... దువ్వాడ మాధురికి తనూజ ఝలక్