సండే ఫన్ డే ఎపిసోడ్ మొదట్లోనే తనూజ, రీతూలను సేవ్ చేసి ఆమె ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తనూజా -కళ్యాణ్ లను యాక్టివిటీ రూమ్ లోకి పిలిచి, తనూజ సేవ్ అయ్యాక ఏదో చెప్తా అన్నావ్ ఏంటది? అని ప్రశ్నించారు నాగ్. కళ్యాణ్ మాట్లాడుతూ "తనూజా అచ్చం నా ప్రీవియస్ రిలేషన్ అమ్మాయి ఫేస్ లాగే ఉంటుంది. ఈ హౌస్ లోకి వచ్చాక నేను దేవుడిని కోరుకున్నది ఒక్కటే. తనూజాకు ఫీవర్ పాజిటివ్ రావొద్దు అని. కొన్ని రీజన్స్ వల్ల తనూజాతో ఈ వీక్ అంతా సరిగ్గా ఉండలేదు. సారీ చెప్పాలనుకున్నాను. చాలా రోజుల నుంచి ఇదే చెప్పాలనుకున్నా" అంటూ సస్పెన్స్ కు తెర దించాడు. "ఇవన్నీ ఆల్రెడీ చెప్పాడు. ఇంకేమైనా ఉన్నా చెప్పొద్దు. మా ఇద్దరికీ మా గురించి క్లారిటీ ఉంది" అని చెప్పింది తనూజా. 

Continues below advertisement

దువ్వాడ మాధురిని నామినేట్ చేసిన తనూజ'గోల్డెన్ బజర్' టాస్క్ లో తనూజా, డెమోన్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి పాల్గొనగా... తనూజా గోల్డెన్ బజర్ ను గెలుచుకుంది. 'గోల్డెన్ బజర్' పవర్ ను గెలుచుకున్న తనూజానే దువ్వాడ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. 1. డైరెక్ట్ నామినేషన్ 2. వాష్ రూమ్, గార్డెన్ క్లీనింగ్ 3. వీక్ అంతా ఇన్విజిబుల్ అనే ఆప్షన్లు ఇచ్చారు నాగ్. కానీ తనూజా మాత్రం ఊహించని విధంగా దువ్వాడ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేసింది.

ఆ ఇన్విజిబుల్ కేప్ ను ఎవరికి ఇస్తావని అడగ్గా, ఇమ్మూ "నా మమ్మాకే" అన్నాడు. కానీ సంజన ఒప్పుకోకపోవడంతో "100 సెకండ్స్ టైమ్ ఇస్తా. హౌస్ మేట్స్ ను కన్విన్స్ చేసుకో" అన్నారు నాగ్. సంజన "ఈ బంపర్ ఆఫర్ నాకెందుకు?" అంటూ గట్టిగా చేయడానికి ట్రై చేసింది. హౌస్ మేట్స్ ఓటింగ్ అడిగి, టై కావడంతో మళ్ళీ ఇమ్మూని ఇరికించారు నాగ్. దీంతో ఇమ్మూ సంజనాకే కేప్ ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి దొంగతనం చేసిన వీడియోను ఫన్నీగా ప్లే చేశారు. సుమన్ శెట్టి, తనూజాతో పాటు పానీ పూరీ టాస్క్ లో దొంగతనంగా తిన్న వీడియోను కూడా ప్లే చేసి నవ్వించారు. తరువాత దివ్యను సేవ్ చేసి రిలీఫ్ ఇచ్చారు.

Continues below advertisement

Also Readబిగ్‌బాస్ డే 47 రివ్యూ... తనూజాకు హెల్త్ ఎమర్జెన్సీ - గుక్కపెట్టి ఏడ్చిన దువ్వాడ మాధురి... అయేషా అవుట్!

నిఖిల్ గౌరవ్ టీం లీడర్లుగా 'సెలబ్రిటీ ఐటెం సాంగ్' టాస్క్ పెట్టారు. నిఖిల్ టీం విన్ అయ్యింది. 'బ్లైండ్ ఫోల్డ్ లో ఫుడ్ ఎక్స్ప్లెనేషన్' అనే టాస్క్ పెట్టారు. ఇందులో గౌరవ్ టీం గెలిచింది. ఇమ్మాన్యుయేల్ ను పవర్ అస్త్రాకు సేవింగ్ పవర్ లాస్ట్ టైమ్ అయిపోయింది. ఇక దానికి పవర్ లేదు. తనూజా దగ్గర ఉన్న 'గోల్డెన్ బజర్'కు వచ్చే వారం సేవ్ చేసే పవర్ ఉంటుంది. "డేంజర్ జోన్ లో ఉన్న సంజన - రమ్యలలో ఎవరిని సేవ్ చేస్తావ్?" అని తనూజాను అడిగారు నాగార్జున. ఆమె సంజన పేరు చెప్పింది.

ఆ ఐదుగురు ట్రాష్ క్యాన్ లో...  సంజన, రమ్యలలో రమ్య ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 13 మందిలో ఐదుగురిని ట్రాష్ క్యాన్ లో వేసి, రీజన్ చెప్పమన్నారు. "కళ్యాణ్ నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తున్నాడు. దివ్య ఒక్కరితోనే ఉండేది, భరణి వెళ్లాక కోపం ఎక్కువ అవుతోంది. తనూజా  ఎవరో చెప్పింది విని మాట్లాడుతుంది, మానిప్యులేటర్. గౌరవ్ మాటల రాక్షసుడు, ఈగో ఎక్కువ, ఎమోషనల్ గా గేమ్ ఆడకు. బుర్రవాడు కళ్యాణ్" అంటూ ఈ 5 మంది ఇమేజెస్ ను ట్రాష్ క్యాన్ లో వేసింది. "నా దురదృష్టం ఏంటో నాకోసం వచ్చిన ఇద్దరు దేవతలు రమ్య, అయేషా వెళ్ళిపోయారు" అని బాధ పడ్డాడు ఇమ్మూ. వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబుగా వాష్ రూమ్ బాధ్యతలను రీతూకి అప్పగించింది రమ్య.

Also Read: బిగ్‌బాస్ డే 48 రివ్యూ... దువ్వాడ మాధురికి నాగ్ మాస్ వార్నింగ్... బయటపడ్డ ఇమ్మూ అసలు రంగు