Bigg Boss Bharani Sreeja Re Entry Task Promo : దివ్వెల మాధురి బిగ్​బాస్​ హోజ్​లోకి అడుగు పెట్టినప్పటి నుంచి శ్రీజతో గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇంట్లోకి రాగానే ఆమెతోనే గొడవలు ప్రారంభమయ్యాయి. అలాంటి శ్రీజకు మాధురి ఎందుకు సపోర్ట్ చేసింది. రీఎంట్రీలో భరణికి అన్యాయం జరిగిందా? ఇంటి నుంచి భరణి వెళ్లిపోవడానికి మాధురినే కారణమా? బిగ్​బాస్ పెద్దగా ప్లాన్ చేసిన ట్విస్ట్ ఏంటో చూసేద్దాం. దానికి సంబంధించిన ప్రోమోలో చాలా హైలెట్స్ ఉన్నాయి. అవేంటంటే.. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్.. 

బిగ్​బాస్ సీజన్ 9లో రీఎంట్రీ కోసం భరణి, శ్రీజ టాస్క్​లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం ఆడిన కట్టు.. పడగొట్టు టాస్క్​లో సుమన్ శెట్టి, కళ్యాణ్ ఇద్దరూ సంచాలకులుగా ఉన్నారు. కానీ ఇద్దరికీ భిన్నవాధనలు ఉన్నట్లు ఉదయం ప్రోమోలోనే చూపించారు. అయితే సెకండ్ ప్రోమోలో కూడా వారి ఇద్దరి డెసీషన్ ఒకటి తీసుకోమని చెప్పాడు బిగ్​బాస్. కానీ వారిద్దరూ తమ నిర్ణయాలను తేల్చుకోలేకపోవడంతో వారిద్దరినీ ఆ పదవి నుంచి తొలగించాడు బిగ్​బాస్. అయితే శ్రీజ, భరణిని కలిసి ఒకరిని ఎంచుకోవాలని.. వారే తుది నిర్ణయం చెప్పాలని అన్నాడు. 

Continues below advertisement

మాధురికి ట్విస్ట్ ఇచ్చిన శ్రీజ.. 

శ్రీజ, భరణి కలిసి ఒకరిని ఎంచుకోవాల్సి ఉండగా.. శ్రీజ మాధురికి ఓకే అని చెప్పింది. దీంతో అందరూ షాకయ్యారు. తర్వాత నవ్వుకున్నారు. మాధురి మాత్రం బిగ్​బాస్ అంటూ గట్టిగా అరిచింది. తర్వాత గట్టిగా ఊపిరితీసుకుని తన నిర్ణయాన్ని చెప్పింది. అయితే ఇక్కడ గ్రేట్ ట్విస్ట్ ఏంటంటే.. శ్రీజకు మాధురి పాయింట్ ఇచ్చింది. బిగ్​బాస్ మీరు బాక్స్​లో పెట్టాలని అనేది సరిగ్గా చెప్పలేదు.. పేర్చడం గురించే చెప్పారు కాబట్టి.. దానిని దృష్టిలో పెట్టుకుని శ్రీజకు పాయింట్ ఇస్తున్నాను బిగ్​బాస్ అని తన నిర్ణయం చెప్పింది. 

భరణికి గాయం.. ఇంటి నుంచి వెళ్లిపోయాడుగా..

తర్వాత గేమ్ మళ్లీ కంటిన్యూ అయింది. రెండు జట్లు పోరాడుతుండగా.. పవన్, భరణి కలిసి స్విమ్మింగ్ పూల్​లో పడ్డారు. ఆ సమయంలో భరణి రిబ్స్​కి గాయం అయినట్లు ప్రోమోలో చూపించారు. వెంటనే వైద్య సహాయం తీసుకోగా.. టెస్ట్​ల కోసం బయటకు రావాలంటూ చెప్పారు డాక్టర్స్. దీంతో భరణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 

ట్విస్ట్ అదే.. 

గాయంతో బయటకు వెళ్లిన భరణి మళ్లీ ఇంట్లోకి వచ్చినట్లు.. శ్రీజకు మళ్లీ అన్యాయమే జరిగినట్లు లైవ్ చూస్తే తెలుస్తుంది. బిగ్​బాస్ మళ్లీ ఎలాంటి ట్విస్ట్​లు పెట్టాడో.. ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.