ఉదయాన్నే ఫ్లోరాకి టీ మిస్ అవ్వడంతో రాముపై ఒంటికాలితో లేచింది తనూజ. ఎవరెవరు టీ తాగుతారు అనేది అడిగి చెప్పడమే అతను చేసిన తప్పు. అంతకంటే ముందే సంజన సుమన్ శెట్టి సిగరెట్లు దాచేసింది. రీజన్ లేకుండా అలుగుతుంది "అలిగే దేవి" అంటూ ఇమ్మాన్యుయేల్ దగ్గర తనూజాకు బిరుదు ఇచ్చేసింది సంజన. తనూజ కాఫీ పెట్టుకుందామని వెళ్తే... అక్కడ కాఫీ కనిపించకపోవడంతో మొదలైంది రచ్చ. ఫుడ్ తినేటప్పుడు రాముపై అలా అరవడం కరెక్ట్ కాదని చెప్పడంతో ఇమ్మాన్యుయేల్ -తనూజ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో భరణి సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశాడు. 

Continues below advertisement


వైల్డ్ కార్డ్ ఎంట్రీల రచ్చ
షాకిబ్, అనూష రత్నం, దివ్య నిఖిత, నాగ ప్రశాంత్ హౌజ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా అడుగు పెట్టారు. "ఈ నలుగురు ఇంట్లోకి, మీ ప్రత్యర్థిగా ఈ ఆటలోకి అడుగు పెట్టడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలనేది నేను ఇప్పుడు మీ చేతిలో పెడుతున్నాను. ఈ ఆటలో ఏది తగ్గిందని భావిస్తున్నారో, హౌజ్ లోకి వస్తే మీతో పాటుగా ఏం తీసుకొస్తారో అప్పిల్ ద్వారా హౌజ్ మేట్స్ అందర్నీ ఒప్పించడానికి ప్రయత్నించండి" అని బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆదేశించారు. 


నాగ ప్రాసెస్ మొదలు పెట్టగా... "అగ్ని పరీక్షలో ఒక మంచి ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాను. గొడవలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాను" అని తన అప్పీల్ చేసుకున్నాడు. దివ్య "అనవసరమైన విషయాలను గెలికి, అనవసరంగా నేనే బిస్కెట్ కాను. నేను ఓనర్ కాదు, టెనెంట్ కాదు. వైల్డ్ కార్డు ఎంట్రీగా నా వైల్డ్ పర్ఫామెన్స్ ఇస్తానని అనుకుంటున్నాను" అంటూ తన వంతు అప్పీల్ చేసింది. షాకీబ్ మాట్లాడుతూ "అగ్ని పరీక్షలో నేను డిఫరెంట్ క్యారెక్టర్ అన్నట్టుగా పోర్ట్రైట్ అయింది. అది హౌజ్ లో మిస్ అయినట్టుగా అనిపిస్తోంది. గేమ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అంటూ అప్పీల్ చేశాడు. అనూష మాట్లాడుతూ "బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ టెస్ట్. నేనుంటే హౌజ్ లో ఫుల్ ప్యాకేజ్. ఎవరినీ తొక్కుకుంటూ వెళ్ళాలి అనడం కంటే అనూష ప్రజల మనసు గెలుచుకోవడం ముఖ్యం. మీమ్స్ భాషలో మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తా" అని చెప్పాడు.


కళ్యాణ్ మాట్లాడుతూ "నీ అపోనెంట్ నిన్ను బిలో బెల్ట్ మాట్లాడితే ఏం చేస్తావ్? బెస్ట్ ఫ్రెండ్ నామినేట్ చేస్తే ఏం చేస్తావ్ ? అనే ప్రశ్నలకి అనూష మాట్లాడుతూ "పాయింట్ పెట్టడం వరకే నా వంతు అవతలి వాళ్లకు ఎలా అర్థమైంది అనేది నాకు అనవసరం. అది జనాలు చూసుకుంటారు. అలాగే నా ఫ్రెండ్ నన్ను నామినేట్ చేసింది అంటే కరెక్ట్ పాయింట్స్ ఉంటే నేను దాన్ని ఒప్పుకుంటాను" అని సమాధానం చెప్పింది. 


"మా ప్లేస్ లో నుంచి ఒకరిని స్క్వాప్ చేసుకోవాలంటే లేదా మాలో నుంచి ఒకరిని బయటకు పంపాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళ కన్నా మీరు ఎలా బెటర్?" అని శ్రీజ ప్రశ్నించింది దివ్యని. అనూష అయితే "నిన్నే రీప్లేస్ చేసుకుంటాను. ఓ మనిషిని నీ ఈగో సాటిస్ఫై అవ్వకపోతే పొడుస్తూనే ఉంటావు. నువ్వొక ఐటీ ప్రొఫెషనల్ అయ్యి కూడా..." అనడంతో... "నువ్వే బిలో బెల్ట్ వెళ్లావు" అంటూ పంచ్ వేసింది శ్రీజ. ఇక షాకిబ్ కళ్యాణ్ ను స్వైప్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళని బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు పంపించేశారు. 


బుర్ర బద్దలయ్యే ట్విస్ట్  
ఆ నలుగురులో బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డుగా అడుగు పెట్టడానికి అర్హులైన ఇద్దరి పేర్లను బ్యాలెట్ బాక్స్ లో ఓటుగా వేయాలని, ఎవరికి ఓటు వేశారు అనే విషయాన్ని ఇంట్లో ఎవరితోనూ చర్చించకూడదని బిగ్ బాస్ ఆదేశించారు. ఇంటి సభ్యులందరూ ఓటేశాక బిగ్ బాస్ హౌజ్ లో రీతూ చౌదరికి దెయ్యం పూనింది. ఫన్నీగా రీతూ - ఇమ్మూ చేసిన ఈ స్కిట్ హైలెట్ అయ్యింది. చివరగా బిగ్ బాస్ "నా ఇంట్లోకి తీసుకు రాకుండా ఉండడానికి దివ్యకి అతి తక్కువ ఓట్లు వేసి మీరు చదరంగం ఆడారు. కానీ ఇది చదరంగం కాదు, రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం" అంటూ బిగ్ బాస్ దివ్యని ఆహ్వానించారు. "ఇప్పటినుంచి దివ్య టెనెంట్స్ లో ఒకరిగా ఉంటారు.. మీరందరూ ఇప్పటినుంచి వేసే ఎత్తులేంటో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటాను" అంటూ బుర్ర బ్లాస్ట్ అయ్యే షాక్ ఇచ్చారు. దీంతో హౌజ్ మేట్స్ మొహాలు మాడిపోయాయి. ఇక రాగానే దివ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు మరికొన్ని విషయాలు చెప్పి కంటెస్టెంట్స్ మనసులను కలవర పెట్టింది.