కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. చూస్తుండగానే రెండవ వీకెండ్ కూడా వచ్చేసింది. ఇక వీకెండ్ అనగానే పోస్ట్ నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ తప్పొప్పులను ఎత్తిచూపుతూ, వారికి వార్నింగ్ ఇచ్చే క్షణం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అదే జరిగింది. కానీ చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 

Continues below advertisement

అక్కినేని నాగేశ్వరరావు 101వ వర్ధంతి నాగార్జున 'బిగ్ బాస్ సీజన్ 9' వేదిక పైన తన తండ్రి, లెజెండరీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు 101 వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. నాగేశ్వరరావు రాసిన "అఆ అనే పుస్తకంలో ప్రతి అక్షరం నా జీవితం" అంటూ నాగార్జున తన తండ్రిని స్మరించుకున్నారు. "సోమవారం నుంచి గురువారం వరకు వచ్చిన ఎపిసోడ్స్ ని చూశాము. శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం" అంటూ నేటి ఎపిసోడ్ ను మొదలుపెట్టారు. 

మళ్ళీ చిచ్చు పెట్టిన కిచెన్ కొత్తగా కెప్టెన్ అయిన డిమోన్ పవన్, సంజన మధ్య కిచెన్ లో గొడవ మొదలైంది. "సుమన్ ఉండగా, ఇమ్ముకి ఎందుకు పని చెప్తున్నారు?" అంటూ పవన్ ప్రశ్నించగా, సంజన తాను ఇదే చివరిసారి వంట చేయడం అని తేల్చేసింది. ఇక మనీష్ తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రియాపై అలిగి నిరహార దీక్ష మొదలెట్టేసాడు. బద్ద శత్రువులైన సంజన, ఫ్లోరా కలిసి డ్రింక్స్ దిగతనం చేసి, అందరూ నిద్ర పోయాక గార్డెన్ లో తాగేశారు. "మా థమ్స్ అప్ మిస్సింగ్" అంటూ ప్రియ, పవన్ షాక్ అయ్యారు. అంతేకాదు దీని గురించి మాట్లాడకుండా రివర్స్ గేమ్ ఆడాలని డిసైడ్ అయ్యారు.

Continues below advertisement

కెప్టెన్సీ రద్దుతో షాక్ కెప్టెన్సీ టాస్క్ లో భరణిని ఎలిమినేట్ చేసిన విధానం గురించి నాగార్జున హౌస్ మేట్స్ తో చర్చించారు. ఓ వీడియోని ప్లే చేసి అందులో ఏం జరిగిందో క్లియర్ చేశారు. అది కరెక్ట్ కాదని తనూజ, సంజన చెప్పినప్పుడు ఎందుకు వినలేదని సంచాలక్ రీతూని ప్రశ్నించారు. రీతూ... డీమాన్ ను కెప్టెన్ చేయడానికే అలా చేసినట్టు అందరూ అనుకుంటున్నారని వెల్లడించారు. కానీ రీతూ తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. డిమాన్ కూడా తనకు ఫెయిర్ గా ఆడి కెప్టెన్ కావాలని ఉందని చెప్పడంతో ఈ కెప్టెన్సీ టాస్క్ ను నాగ్ రద్దు చేశారు.

Also Read: బిగ్ బాస్ డే 12 రివ్యూ... హౌస్‌లో అసలు రూపాలు బయటపడ్డాయ్... రీతూ అరాచకం! 

సన్నాయి నొక్కులకు స్ట్రాంగ్ వార్నింగ్ప్రతీ విషయంలోనూ ప్రియా, శ్రీజ నోరు పారేసుకుంటున్నారు అంటూ నాగ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రియా ఏదైనా మొదలు పెట్టగానే శ్రీజ పక్క నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుంది అంటూ వాళ్లిద్దరి నోరు మూయించారు. కానీ ప్రియా ఎక్కడా తగ్గకుండా తన వెర్షన్ చెబుతూనే ఉంది. దీంతో నాగ్ వీడియోలు చూపించి, ఆమె తప్పులు ఏంటో చూపించారు. అలాగే సైలెంట్ గా ఓనర్ అయ్యావు అంటూ రాముకి సైలెంట్ కిల్లర్ అనే బిరుదు ఇచ్చారు. తిండి మానేసిన మర్యాద మనీష్ గోడు విని, ఏదేమైనా తిండి మీద అలగకూడదని సలహా ఇచ్చారు నాగ్. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ బాగా ఆడారు అంటూ ప్రశంసలు కురిపించిన నాగ్, తనూజతో సహా మిగతా వారికి మొట్టికాయలు వేశారు. అలాగే హరీష్ కు తన భార్య నుంచి స్పెషల్ మెసేజ్ అందించారు నాగ్. 

రంగు పడింది... సీన్ రివర్స్ అయ్యింది  ప్రియా, శ్రీజ, మర్యాద మనీష్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ లకు ఈరోజటి ఎపిసోడ్ లో రంగు పడింది. ఎక్కువ మందికి ఓనర్స్ ను రంగు పడడంతో డబుల్ డోస్ ట్విస్ట్ ఇచ్చారు నాగ్. ఇప్పటి నుంచి ఓనర్స్ టెనెంట్స్... టెనెంట్స్ ఓనర్స్ గా మారతారు అంటూ షాక్ ఇచ్చారు. మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అన్నది రేపటి ఎపిసోడ్ లో తేలుతుంది అంటూ నేటి ఎపిసోడ్ కు బైబై చెప్పారు.

Also Read: బిగ్ బాస్ డే10 రివ్యూ.. ఇద్దరితో రీతూ పులిహోర.. కెప్టెన్సీ కోసం రేసు మొదలు.. మొదటి ఛాలెంజ్ ఏంటంటే?