Bigg Boos Telugu 9 Latest Promo Review: బిగ్ బాస్ హౌస్‌లో ఓనర్స్, టెనెంట్స్ మధ్య టాస్కుల పోరు హోరాహోరీగా సాగుతోంది. శుక్రవారం టెనెంట్లకు ఓనర్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ కల్పించగా... ఒక్కో రౌండ్‌లో ఎలిమినేట్ అయిన వారు ఎవరికైనా సపోర్ట్ చెయ్యొచ్చని చెప్పాడు. 

Continues below advertisement

సుమన్‌పై సంజనా సెటైర్లు

గేమ్‌లో భాగంగా సంజన చేసిన కామెంట్స్ ఇబ్బందికరంగా అనిపించాయి. సుమన్ శెట్టి ఆడకుండా సోఫాలో కూర్చున్నందుకు అతనిపై సెటైర్లు వేస్తూ... 'మీరు మమ్మల్ని చెడ్డోళ్లను చేసి మీరు గాజులేసుకుని కూర్చోండి.' అంటూ సుమన్‌పై ఫైర్ కాగా... మీరెప్పుడు చెడ్డోళ్లయ్యారంటూ కౌంటర్ ఇచ్చాడు సుమన్. ఇక అలాంటి మాటలు వాడకూడదంటూ ఓనర్ శ్రీజ సంజనకు వార్నింగ్ ఇచ్చారు. అయితే, గేమ్ మొత్తం అయ్యాక సుమన్‌కు సారీ చెప్పారు సంజన. చెల్లిగా భావించి ఆ కామెంట్స్‌పై క్షమించాలని ఆమె కోరగా... దాన్ని సుమన్ యాక్సెప్ట్ చేశారు. సంజన కామెంట్స్‌పై మాత్రం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Continues below advertisement

Also Read: బిగ్ బాస్ డే 12 రివ్యూ.. హౌస్‌లో అసలు రూపాలు బయటపడ్డాయ్.. రీతూ అరాచకం!

సంజన వర్సెస్ రీతూ చౌదరి

టెనెంట్స్ నుంచి పర్మినెంట్ ఓనర్ అయ్యే అవకాశం కోసం జరిగిన ఫైట్‌లో సంజన, రీతూ మధ్య గొడవ గట్టిగానే సాగింది. 'ఫ్రెండ్ షిప్ గురించి ఇక్కడ మాట్లాడొద్దు. మీకు నచ్చినట్లు తీసుకెళ్తుంటే మాట్లాడొద్దా.' అంటూ సంజనపై రీతూ ఫైర్ అయ్యారు. 'గేమ్ ఆడుతుండగా నాకు దెబ్బ తగిలి రక్తం పోయింది.' అంటూ సంజన రియాక్ట్ కాగా... 'నాకూ రక్తం పోయింది.' అంటూ రీతూ ర్యాష్‌గా ఆన్సర్ చెప్పారు. 'మీకు రక్తం పోతే నేను గేమ్ నుంచి వెళ్లిపోతా.' అంటూ ఫైర్ అయ్యారు. 

ఇక సోల్ ఫ్రెండ్స్‌గా ఉన్న తనూజ, రీతూ పర్మినెంట్ ఓనర్స్ టాస్క్‌లో శత్రువులుగా మారినట్లు తెలుస్తోంది. ఇదే టైంలో గేమ్‌లో రీతూపై కోపం చూపించాడు ఇమ్మాన్యుయెల్. 'నువ్వు రేలంగి మామయ్యలా మాట్లాడొద్దు.' అంటూ రీతు ఆన్సర్ చెప్పగా... 'నేను రేలంగి మామయ్య కాదు కానీ నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవే' అంటూ కౌంటర్ ఇచ్చాడు ఇమ్మూ. ఇక అందరూ రీతూనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. సంజన, ఆషా షైనీ, సుమన్ శెట్టి రీతూను గేమ్ నుంచి వెళ్లగొట్టేందుకు ట్రై చేశారు. ఇక రాము రాథోడ్ సైలెన్స్ పర్మినెంట్ ఓనర్‌గా మార్చింది.

మర్యాద మనీష్ అవుట్?

ఇక రెండో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా గట్టిగానే సాగింది. ఫస్ట్ వీక్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం హరిత హరీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్, ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్, భరణి కుమార్ నామినేషన్లలో ఉన్నారు. నామినేషన్ల టైంలో హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి. దమ్ము శ్రీజ, తనూజ, రీతూ చౌదరి... హరీష్‌తో వాదన పెట్టుకున్నారు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

ఓటింగ్‌లో సుమన్ శెట్టి ముందంజలో ఉండగా... భరణి కూడా సేఫ్ ప్లేస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హరిత హరీష్, ఫ్లోరా షైనీకు కూడా పర్వాలేదు. ఇక కామనర్స్ ప్రియా శెట్టి, మర్యాద మనీష్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మనీష్ కంటే ప్రియకే ఎక్కువ ఓట్లు పడేలా కనిపిస్తుండడంతో ఈ వారం హౌస్ నుంచి మనీష్ ఎలిమినేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.