Bigg Boss 9 Telugu - Day 12 Episode 13 Review: బిగ్ బాస్‌లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ పూర్తయింది. రెండో వారం కెప్టెన్‌గా పవన్ ఎన్నికయ్యాడు. కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్‌పై తీవ్రంగా చర్చలు నడిచాయి. ఇమ్మానుయెల్, సుమన్ శెట్టి మధ్య ఎమోషనల్ డిస్కషన్ నడిస్తే.. రీతూ చౌదరి, పవన్, ప్రియా వేరే రకంగా చర్చలు మొదలెట్టారు. ఇమ్మూ ఇప్పటి వరకు ఏడ్చాడని, నా రీతూ నాకు సపోర్ట్‌గా రాకుండా పవన్‌కి సపోర్ట్‌గా వస్తుందని ఏడ్చినట్లుగా సుమన్ శెట్టి, భరణికి చెప్పాడు. మరోవైపు రీతూ ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదార్చుతున్నాడు. వాళ్ళిద్దరి ఓదార్పు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఫెయిర్‌గా ఎవరు ఆడారు, ఫేవరిటిజంగా ఎవరు ఆడారు అనే దానిపై రెండు గ్రూపులుగా ఏర్పడి సుదీర్ఘ చర్చలు జరిపారు.
ఎందుకు రాత్రి అంత ఎమోషనల్ అయ్యావ్.. అని రీతూని హరీష్ అడిగితే.. ఇటు వీడు కెప్టెన్ అయినందుకు హ్యాపీగా ఉండలేకపోయా, అటు వాడు అవ్వనందుకు బాధగా ఉంది. ఎమోషన్స్ స్టక్ అయిపోయాయి. వాళ్లకి నేను ఫెయిర్‌గా ఉండలేదని అనుకుంటున్నారు. ఈ వంకతో తనకు ఏం కావాలో అది కెప్టెన్ నుంచి రీతూ తీసుకుంటుందని ఇమ్ము చెబుతుంటే.. తను దొంగిలించి దాచుకున్న యాపిల్, థమ్సప్‌ను సంజన తాగేస్తున్నారు. కొన్నింటిని దాచి పెట్టారు. ఆ దాచినవి రీతూ చౌదరి చూసి, ఎవరు తీశారనే దానిపై డిస్కషన్ నడిచింది. ఇక ఇంటిలో రెండో కెప్టెన్‌గా ఎన్నికైన పవన్‌కు బిగ్ బాస్ కొన్ని సూచనలు చేశాడు. అవి భరణి చదివి వినిపించాడు. కెప్టెన్సీ బోర్డులో పవన్ ఫొటోని భరణి పెట్టాడు. మనీష్‌ని కిచెన్‌లోకి రాకుండా చూడమని ప్రియా కెప్టెన్‌ని కోరింది.
Also Read- బిగ్ బాస్ డే10 రివ్యూ.. ఇద్దరితో రీతూ పులిహోర.. కెప్టెన్సీ కోసం రేసు మొదలు.. మొదటి ఛాలెంజ్ ఏంటంటే?
ఈ వారం టెనెంట్స్‌లోని ఒకరికి ఓనర్‌గా మారి బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్లడానికి అవకాశం ఇచ్చే టాస్క్‌ని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇందులో అనేక రౌండ్స్ ఉంటాయని తెలిపారు. బాక్స్‌లో నుంచి కొన్ని ఐటమ్స్‌ని విసిరితే.. ఎదురుగా ఉన్న వాళ్లు వాటిని క్యాచ్ చేసి దాచుకోవాలి. ప్రియా సంచాలక్‌గా వ్యవహరించారు. శ్రీజ, మనీష్ బొమ్మలు విసిరితే.. మిగతా నార్మల్ సెలబ్రిటీలు వాటిని క్యాచ్ చేశారు. ఫస్ట్ రౌండ్‌లో ఫ్లోరా అవుట్ అవ్వగా, సంజన క్విట్ అయ్యారు. రౌండ్ 2లో సంజన, ఫ్లోరాలను కొట్టాడని సుమన్ శెట్టిని సంచాలక్ ఎలిమినేట్ చేసింది. రెండో రౌండ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లుగా సంచాలక్ ప్రియా చెప్పింది. మూడో రౌండ్‌లో రీతూ బొమ్మలు ఖాళీ అవ్వగా, రాము బాస్కెట్‌లోని వన్నీ రీతూ తీసేసుకుంది. ఇమ్మానుయెల్ తన బొమ్మలు మొత్తం రాముకి ఇచ్చేశాడు. ఇమ్ము, రీతూ.. తనూజ, రీతూ మధ్య సీరియస్‌గా ఆర్గ్యూమెంట్స్ జరిగాయి. ఈ రౌండ్‌లో రీతూ ఎలిమినేట్ అయిందని శ్రీజ తెలిపింది. నాలుగో రౌండ్‌లో మనీష్, ప్రియా విసరడానికి, హరీష్ సంచాలక్‌గా ఉన్నారు. ఈ రౌండ్‌లో తనూజ ఎలిమినేట్ అయినట్లుగా హరీష్ ప్రకటించాడు.
ఈ టాస్క్‌లో టాప్ 2 గా రాము, ఇమ్మానుయెల్ మిగిలారు. వారిద్దరిలో ఒకరిని ఓనర్ చేయండని ఈ రౌండ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని అడగగా, అందరూ రాము పేరు చెప్పారు. టెనెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో రాముని సెలక్ట్ చేశారని హరీష్.. బిగ్ బాస్‌కు చెప్పాడు. రాముకు బిగ్ బాస్ కొన్ని పనుల నుంచి కూడా విముక్తి ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరూ ఈ టాస్క్‌పై, రాము తీరుపై డిస్కషన్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.