Bigg Boss 9 Telugu Day 11 Episode 12 Review: బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ కంటెండర్స్‌ని సెలెక్ట్ చేసేందుకు పెట్టిన టాస్క్ ఇంట్లో వాగ్వాదానికి దారి తీసింది. టెనెంట్స్ అంతా కలిసి ఓనర్స్ టీం నుంచి ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్లను సెలెక్ట్ చేశారు. ఆ తరువాత ఆ ముగ్గురూ కలిసి టెనెంట్స్ నుంచి ఓ కంటెస్టెంట్‌ను కెప్టెన్సీ కంటెండర్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో ఓ సారి చూద్దాం.

Continues below advertisement

బజర్, నో బజర్ ఛాలెంజ్‌లో భాగంగా రెండు టీంలను వేరే చోట పెట్టాడు బిగ్ బాస్. ఇద్దరికీ కమ్యూనికేషన్ కోసం ఫోన్ కూడా ఇచ్చారు. రెండు టీంలు ఒక వేళ బజర్ కొడితే.. టైమర్ గంట పెరుగుతుంది.. బజర్ కొట్టకపోతే గంట తగ్గుతుంది.. ఒక టీం మాత్రమే బజర్ కొడితే.. ఆ బజర్ కొట్టిన టీం టైమర్ పూర్తిగా జీరో అవుతుందని అన్నాడు. కానీ రెండు టీంలు బజర్‌లు కొట్టేశారు. దీంతో టైమర్ గంట పాటు పెరిగింది. ఇక చివరకు ఓనర్స్ టీం టైమర్ జీరోకి చేరింది. దీంతో ఓనర్స్ టీం గెలిచారని బిగ్ బాస్ తెలిపాడు.

Also Read- బిగ్ బాస్ డే10 రివ్యూ.. ఇద్దరితో రీతూ పులిహోర.. కెప్టెన్సీ కోసం రేసు మొదలు.. మొదటి ఛాలెంజ్ ఏంటంటే?

Continues below advertisement

రీతూకి గోరు ముద్దలు పెట్టింది సంజనా. ఇక ఈ విషయంపై ప్రియ గొడవ చేసింది. నేను ముద్దలు కలిపి పెడితే మాత్రం పాయింట్ అవుట్ చేస్తున్నారు.. మీరు మాత్రం రూల్స్ బ్రేక్ చేయొచ్చా? అని కెప్టెన్ సంజనాని నిలదీసింది ప్రియ. ఇక సంచాలక్‌గా మనీష్ సైతం కెప్టెన్ చేసింది తప్పే అని, పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని స్విమ్మింగ్ పూల్‌లో దూకండి అని అన్నాడు. కానీ సంజనా మాత్రం దూకేందుకు సిద్ద పడలేదు. దీంతో తామే ఏదో రకంగా నీళ్లు పోసేస్తామని మనీష్, ప్రియ చెప్పారు.

కెప్టెన్సీ కంటెండర్ల గురించి బిగ్ బాస్ టాస్క్ ఆరంభించాడు. గెలిచిన ఓనర్స్ టీం నుంచి ఓ ముగ్గురిని కెప్టెన్సీ కంటెండర్లను సెలెక్ట్ చేయాలని టెనెంట్స్‌కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో భరణి, మనీష్, పవన్‌లను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఈ ముగ్గురూ కలిపి టెనెంట్స్ నుంచి ఒక కంటెస్టెంట్‌ను ఎంచుకోమని చెప్పడంతో ఇమ్ముని సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా కెప్టెన్సీ టాస్క్ అయిన రంగు పడుద్ది ఆటను భరణి, మనీష్, పవన్, ఇమ్ములు ఆడారు.

Also Readబిగ్‌ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?

టీ షర్ట్‌పై ఎక్కువ రంగు ఉన్న కంటెస్టెంట్ అవుట్ అవుతారు అంటూ పెట్టిన ఈ ఆటకు రీతూ సంచాలక్‌గా వ్యవహరించింది. మొదటి దశలో మనీష్ అవుట్ అయ్యారు. రెండో లెవెల్‌లో భరణిని రీతూ పక్కన పెట్టేసింది. ఆగమని చెప్పినా కూడా ఆగకుండా రంగు పూస్తున్నాడని భరణిని అవుట్ చేసింది. చివరకు ఆటలో పవన్ గెలిచి సెకండ్ వీక్ కెప్టెన్‌గా నిలిచాడు.

ఇక ఈ కెప్టెన్సీ ఆట జరుగుతున్నప్పుడు ప్రియ, శ్రీజ పిచ్చి పిచ్చిగా వాగారు. మనీష్, పవన్.. భరణి, ఇమ్ము కలిసి మొదటి లెవెల్‌లో ఆడినట్టుగా కనిపించింది. ఫస్ట్ లెవెల్లో మనీష్ అవుట్ అయ్యాడు. అక్కడ శ్రీజ, ప్రియ మాత్రం కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీస్ అని ప్రొజెక్ట్ చేశారు. ఆ తరువాత భరణి, ఇమ్ము కలిసి ఆడుతున్నారు.. రంగులు పూసుకోవడం లేదు అంటూ ఇలా టాస్క్ జరుగుతున్నంత సేపు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు.

చివరకు భరణిని రీతూ అవుట్ చేస్తే మాత్రం ఎగిరి గంతులు వేశారు. ఇక పవన్ గెలిచిన తరువాత గాల్లో తేలిపోయినట్టుగా సంబరపడ్డారు. మరి దీన్ని గ్రూప్ గేం అనరా?.. ఓనర్స్ టీం గ్రూపు గేమ్‌గా ఆడి.. టెనెంట్స్ మాత్రం గ్రూపుగా ఆడితే.. దాన్ని గ్రూపు గేమ్ అని తెగ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రెండో వారంలో కెప్టెన్‌గా పవన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Also Read- బిగ్‌బాస్‌ డే9 రివ్యూ... ముగిసిన సెకండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నదెవరంటే?