Bigg Boss 8 Abhay Naveen: మూడో కంటెస్టెంట్‌గా‌ 'పెళ్లి చూపులు' ఫేం అభయ్‌ నవీన బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు సీరియల్‌తో విష్ణుగా గుర్తింపు పొందిన అతడి అసలు పేరు 'అభయ నవీన్‌'. తెలంగాణలోని సిద్దిపేటలో పుట్టిన అతడు ఇంజనీరింగ్‌ చదివాడు. కాలేజీ అయిపోగానే బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో లైఫ్‌ సెటిలైపోయిందనుకున్నాడట. కానీ నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడట. దానికంటే మందు చిన్న వీడియోలు చేశాడట. అవి చూసి పూరీ జగన్నాథ్‌ అతడిని పెళ్లి చూపులు సినిమాకు రిఫర్ చేశాడట. అలా నటుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అభయ్ కి 12 ఏళ్లయినా చెప్పుకోదగ్గ సక్సెస్‌ లేదట. 


నా లైఫ్‌ వరస్ట్‌ ఫేస్‌ అదే


గుర్తింపు వచ్చినా కెరీర్‌లో సక్సెస్‌ లేకపోవడంతో డైరెక్షన్‌పై ఫోకస్‌ పెట్టాడట. కథ రాసుకుని తానే దర్శకుడిగా 'రామన్న యూత్‌' సినిమా చేశాడు. ఆ సినిమా అంతా ఒకే అయ్యి అవుట్‌ పూట్‌ కూడా రెడీ చేశాడు. శనివారం ఆ సినిమా చూసిన తన తండ్రి ఆదివారం మరణించారట. దీంతో మూవీ రిలీజ్‌ని ఆపేశాడట. ఇక తన లైఫ్‌లో వరస్ట్‌ ఫేస్‌ అదేనని, మళ్లీ తన తండ్రి ఆశీర్వాదం  సినిమా చేసి రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టానన్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 8 సీజన్‌లోకి అడుగుపెట్టాడు.