Bigg Boss 8 Telugu Finale Episode Avinash at 5th and Prerana at 4th Position: బిగ్ బాస్ అంటే ఆరంభం, ముగింపు రెండూ కూడా అదరిపోతాయి. ప్రతీ సారి బిగ్ బాస్ ప్రారంభానికి ఉండే హడావిడి.. ముగింపు టైంలో చేసే సెలెబ్రేషన్స్ అందరికీ తెలిసిందే. ఇక ఈ ఆదివారం నాటితో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఎండ్ కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఏర్పాటు జరిగాయి. ఈ సండే ఎపిసోడ్ షూటింగ్ అంతా కూడా నిన్నటి నుంచి బీబీ టీం ప్లాన్ చేస్తూనే ఉంది. శనివారం జరిగిన షూట్ ఎపిసోడ్‌లోనే అవినాష్, ప్రేరణలు అవుట్ అయ్యారని సమాచారం.


ఇక యూఐ మూవీ ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్‌కు వచ్చిన కన్నడ స్టార్ ఉపేంద్ర బిగ్ బాస్ స్టేజ్ మీద మెరిశాడు. లోపలకు వెళ్లి ముక్కు అవినాష్‌ (జబర్దస్త్ అవినాష్‌)ను బయటకు తీసుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నాలుగో స్థానంలో ప్రేరణ అవుట్ అయిందని తెలుస్తోంది. డాకు మహారాజ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ ఇంటి లోపలకు వెళ్లి ప్రేరణని స్టేజ్ మీదకు తీసుకొచ్చినట్టుగా సమాచారం. ఇక టాప్ 3లో నబిల్, నిఖిల్, గౌతమ్ మిగిలిపోయారు. టాప్ 2కి వచ్చాక... సూట్ కేసు బేరాలు ఓ రేంజ్‌లో జరిగాయని అంటున్నారు. నబీల్ మూడో స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది.


Also Read'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?


కానీ అక్కడకు వెళ్లిన తరువాత కచ్చితంగా డబ్బులు అయితే తీసుకోరు. ఇక విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనే చర్చ మాత్రం నిఖిల్, గౌతమ్‌ల మీద ఎక్కువగానే జరుగుతుంది. ఈ ఎనిమిదో సీజన్ ట్రోఫీని కన్నడ అబ్బాయికి చెందుతుందా? తెలుగు కుర్రాడికి వస్తుందా? అని అంతా అనుకుంటున్నారు. ఈ ఎనిమిదో సీజన్‌ ఫినాలే ఎపిసోడ్‌ను బీబీ టీం గ్రాండ్‌గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు విజయ్ సేతుపతి కూడా వస్తున్నాడు.


Also Readబిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో


విడుదల 2 ప్రమోషన్స్ కోసం ఇక్కడకు వచ్చిన విజయ్ సేతుపతి పనిలో పనిగా బీబీ స్టేజ్ మీద కనిపించబోతోన్నాడు. తమిళంలో ఆల్రెడీ బిగ్ బాస్ 8వ సీజన్‌ను విజయ్ సేతుపతి హెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హోస్ట్ తెలుగు బిగ్ బాస్ స్టేజ్ మీద రానున్నబోతోన్నాడు. ఇక ఈ సారి రామ్ చరణ్ చేత బిగ్ బాస్ ట్రోఫీని ఇప్పించబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు వచ్చి సందడి చేశారట. కానీ విష్ణు, హరితేజ, నయని వంటి వారు రానట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్‌తో ఈ ముగ్గురికీ విపరీతమైన నెగెటివ్ ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.


Also Read: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే: ఆ ఇద్దరి మీదే అందరి ఫోకస్... బిగ్ బాస్ 8 ట్రోఫీని ఎవరు గెలుస్తారో మరి!