12th week nominations List Prerana, Yashmi,Nikhi,l Nabeel, Pruthvi: బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం నామినేషన్స్ అదిరిపోయాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంట్లోకి తీసుకొచ్చి.. వారితో నామినేట్ చేయించాడు బిగ్ బాస్. దీంతో సోనియా, శేఖర్ బాషా, బేబక్క, నైనిక, సీత, మణికంఠ, ఆదిత్య ఇలా అందరూ వచ్చి సరైన పాయింట్లతో నామినేట్ చేశారు. వీళ్లంతా కూడా నబిల్, నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణలనే నామినేట్ చేశారు. మొట్టమొదటి సారిగా కన్నడ బ్యాచ్ అంతా కూడా నామినేషన్లోకి వచ్చింది. మరి ఈ వారంతో కన్నడ బ్యాచ్ బీటలు వాలేలా కనిపిస్తోంది.
మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఆదిత్య వచ్చి.. యష్మీ, ప్రేరణల్ని నామినేట్ చేశారు. ఆ ఇద్దరిదీ గ్రూప్ గేమ్ అని, పక్షపాతం చూపిస్తున్నారు.. మీలో మీరు ఎందుకు నామినేట్ చేసుకోరు అంటూ ఇలా వారి ఆటని బయటపెట్టేశాడు. ఇక నైనిక ఎంట్రీ ఇచ్చి నబిల్‌ను నామినేట్ చేసింది.. ఆ పాత నబిల్, ఆ షేర్ ఎక్కడా? గేమ్‌లు ఆడటం లేదు.. సేఫ్ ప్లేయర్ అయ్యావ్ అంటూ కారణాలు చెప్పింది. ఆ తరువాత యష్మీని నామినేట్ చేస్తూ మొదట్లో ఉన్నట్టుగా లేవు.. మారిపోయావ్.. నిఖిల్‌తోనే డ్యాన్స్ చేయాలని ఎందుకు అంత గొడవ పెట్టుకున్నావ్? అంటూ నాటి విషయాల్ని గుర్తు చేసింది.
మణికంఠ వచ్చి నిఖిల్‌ను నామినేట్ చేశాడు. నీ గ్రాఫ్ తగ్గిపోతోంది.. మాటలు మార్చుతున్నావ్.. ఒక చోట ఒకలా చెబుతున్నావ్.. ఇంకో చోట ఇంకోలా చెబుతున్నావ్.. మాస్క్ తీసేయ్.. అగ్రెషన్ లేదా ఎమోషన్ ఏదో ఒకటి చూపించు.. ఫిల్టర్ తీసి ఆడు అని చెప్పుకొచ్చాడు. తరువాత నబిల్‌ను నామినేట్ చేస్తూ.. ఒకప్పుడు షేర్ లా ఆడావ్.. ఆ తరువాత సేఫ్ గేమర్‌లా అనిపించింది.. త్యాగాలు వదిలేయ్.. ఎమోషన్స్ పక్కన పెట్టి ఆడు అని చెప్పాడు.
ఆ తరువాత సీత వచ్చి.. ప్రేరణ పరువు తీసింది. మెగా ఛీప్ అయ్యాక పూర్తిగా మారావ్.. నియంతలా చేశావ్.. బయటి నుంచి చూసిన మాకు నువ్వు ఇంకోసారి మెగా ఛీప్ కాలేవు అని అర్థమైంది.. అందరినీ కించపర్చేలా, తక్కువ చేసి మాట్లాడావ్ అని చెప్పింది. ఆపై యష్మీని నామినేట్ చేస్తూ.. ప్రేరణ తన భర్తతో ఉంటే క్రింజ్ అని అన్నావ్.. నిఖిల్ మీదే ఫోకస్ ఉంది.. ఆ తరువాత నీ ఆట పూర్తిగా కనిపించలేదు.. ట్రాప్‌లో పడకు.. నిఖిల్ ఆడోళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడు.. నిఖిల్ తన వెనకలా తిప్పించుకుంటున్నాడు.. ఎమోషన్స్ పరంగా డౌన్ చేస్తున్నాడని అనిపిస్తుంది అని చెప్పింది.
ఇక సీత చెప్పిన కారణాలకు నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. నేను ఆడోళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నానా? సోనియా నా వల్ల పోయిందా? సీత నా వల్ల పోయిందా? అంటూ బాధపడ్డాడు. యష్మీకి మొహం మీద చెప్తే ఫీల్ అయింది.. కనీసం నన్ను మనిషిలా కూడా చూడటం లేదు అని హర్ట్ అయింది.. ఇవన్నీ ఎవ్వరూ చూడటం లేదా అని పృథ్వీతో చెబుతూ బాధపడ్డాడు. అలా మొత్తానికి ఈ వారం అయితే యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, నబిల్ నామినేట్ అయ్యారు. ఈ సారి కన్నడ బ్యాచ్‌లోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. చూస్తుంటే ప్రేరణ, యష్మీల్లోంచి ఎవరో ఒకరు బయటకు వచ్చేలా ఉన్నారు. మరి ఈ వారం బయటకు ఎవరు వస్తారో చూడాలి.