12th week nominations Soniya Nikhil Yashmi Issue: బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ మంచి రసవత్తరంగా సాగింది. ఎలిమినేటే్ అయిన  కంటెస్టెంట్లను పిలిపించిన బిగ్ బాస్ వారితో నామినేషన్ చేయించాడు. అలా సోమవారం నాటి ఎపిసోడ్‌లో సోనియా, బేబక్క, శేఖర్ బాషాలు వచ్చారు. వారి వారి నామినేషన్ పాయింట్లను చెబుతూ ఇద్దరిద్దరిని నామినేట్ చేశారు. అసలు సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..


గౌతమ్‌ను అందరూ టాప్ 5లో పెట్టడం, గౌతమ్ సేఫ్ అవ్వడాన్ని ప్రేరణ జీర్ణించుకోలేకపోయింది. గౌతమ్ ఫస్టే వెళ్లిపోవాల్సింది కానీ.. ఇప్పటి వరకు వచ్చాడు అంటూ ఒకటే ఏడ్పేసింది ప్రేరణ. ఆమె కుళ్లు, ద్వేషం అంతా కూడా అక్కడ బయటపడినట్టు అనిపించింది. యష్మీ ఎలిమినేట్ అవుతుందని కూడా ప్రేరణ అనుకుందట.  


ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా సోనియా ఇంట్లోకి వచ్చింది. ప్రేరణని నామినేట్ చేస్తూ.. మధ్యలో దూరుతావ్.. పక్షపాతం చూపిస్తావ్..  నబిల్‌కి ఫన్నీగా, గౌతమ్‌కు సీరియస్‌గా పనిష్మెంట్లు ఇచ్చావ్ అని చెప్పింది. ఇక మధ్యలో సోనియాని అక్కా అని వెటకారంగా పిలిచింది. దీంతో సోనియా సీరియస్ అయింది. దెబ్బకు సారీ చెప్పేసింది. సారీ చెప్పే వరకు సోనియా వదల్లేదు. తల మీద షుగర్ బాటిల్‌ను గట్టిగా కొట్టేసి నామినేట్ చేసింది సోనియా. అలా కొట్టిన తరువాత సారీ చెబుతుంటే.. నీ సారీ అవసరం లేదు.. అని ప్రేరణ వెళ్లిపోయింది.


నిఖిల్‌ని సోనియా నామినేట్ చేస్తూ.. నువ్వు ఇంత వరకు సరైన కారణంతో నామినేట్ చేయలేదు.. యష్మీ ఎమోషన్స్‌‌తో ఆడుకున్నావ్.. అని ఇలా అన్ని పాయింట్లను తీసింది. నేను యష్మీ ఎమోషన్స్‌తో ఆడుకోలేదు అని నిఖిల్ క్లారిటీ ఇస్తుంటే.. మధ్యలో యష్మీ తిరగబడింది. నువ్వు నాకు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.. అన్నీ డిప్లమెటిక్‌గానే చెప్పావ్ అని యష్మీ చెప్పింది. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. కానీ నేను నీ వెనకాల పడిపోతోన్నాను అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశావ్ అని యష్మీ ఏడ్చేసింది. అసలు యష్మీకి నిఖిల్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే.. నిఖిల్‌తో డ్యాన్స్ చేస విషయంలో విష్ణు పెద్ద రచ్చ ఎందుకు చేసింది? గౌతమ్‌ను వాడుకుని నిఖిల్‌ను ఎందుకు రెచ్చగొట్టిందో ఆమెకే తెలియాలి.


ఆ తరువాత బేబక్క ఎంట్రీ ఇచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. కానీ పృథ్వీ మాత్రం మళ్లీ తన పాత పంథానే అవలంభించాడు. బేబక్కని కించపర్చేలా వెటకారంగా ఇమిటేట్ చేశాడు. గేమ్ పరంగా బాగానే ఉన్నావ్ కానీ.. నా కోసం ఎప్పుడూ స్టాండ్ తీసుకోలేదు అని నిఖిల్‌ను నామినేట్ చేసింది. ఆ తరువాత శేఖర్ బాషా వచ్చి సరైన పాయింట్లతో నామినేట్ చేశాడు. గ్రూపు గేమ్ ఆడుతున్నారు.. నిఖిల్‌ అంత చేసినా కూడా మీరు అతడ్ని నామినేట్ చేయకుండా.. గౌతమ్‌ని నామినేట్ చేస్తున్నారు.. మీదంతా ఓ గ్రూపుగా ప్రొజెక్ట్ అవుతోందని యష్మీ, ప్రేరణని నామినేట్ చేశాడు.


Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 78 రివ్యూ: 'మామా ఏక్ పెగ్ లా' అంటోన్న యష్మీ... విష్ణు ప్రియకు ‘బత్తాయి’, పృథ్వీకి బలుపు - బతికిపోయిన అవినాష్



పానిపట్టు టాస్కులో నిఖిల్ మమ్మల్ని హర్ట్ చేయలేదు అని యష్మీ చెప్పుకొచ్చింది. మరి ఇదే విషయాన్ని వీకెండ్‌లో ఎందుకు చెప్పలేదు.. నామినేషన్స్ టైంలో ఎందుకు  చెప్పలేదు అని అడిగితే.. ఎందుకు చెప్పాలి? అంటూ తిరగబడుతోంది. యష్మీ ఫ్లిప్ స్టార్ అని మరోసారి అందరికీ అర్థం అయిపోయింది. సోనియా ఎలిమినేషన్ పాయింట్లలో అందరినీ కావాలనే ఇంక్లూడ్ చేస్తోంది.. మనం కూడా ఆమెకు సపోర్ట్ చేస్తామని ఇలా చేస్తోందంటూ యష్మీకి ప్రేరణ చెప్పింది. 


నిఖిల్‌కి తన అమ్మ ఇచ్చిన సలహా తరువాత గౌతమ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడట. ఈ విషయాన్ని గౌతమ్ అడిగాడు. అందుకేనా నాకు షుగర్ కోటింగ్ వేస్తున్నావ్ అంటూ కాస్త ఓవర్ చేశాడు గౌతమ్. మొత్తానికి బయటకు కావ్య.. ఇంట్లోకి వచ్చి సోనియా.. నిఖిల్‌ను బ్యాడ్ చేసేస్తున్నారు. మరి ఈ దెబ్బతో నిఖిల్ విన్నింగ్ ఛాన్సెస్ ఏమైనా తగ్గుతాయేమో చూడాలి. ఇలా నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా మిగిలిపోయింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు వచ్చి.. ఎవర్ని నామినేట్ చేస్తారో చూడాలి.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 76 రివ్యూ: తేజని హీరో చేసిన బిగ్ బాస్.. ఫ్యామిలీ ఎపిసోడ్‌ సంపూర్ణం.. అవినాష్‌కు కలిసొచ్చిన లక్