Hariteja  Biching About Rohini and 10th week Mega chief contender task: బిగ్ బాస్ ఇంట్లో పదో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మాటలు, చేసుకున్న వాగ్వాదాలు అందరికీ తెలిసిందే. గత వారం నానా రచ్చ చేసిన నిఖిల్‌ను మాత్రం కన్నడ భామలు నామినేట్ చేయలేదు. టాస్కులో నిఖిల్ మీద యష్మీ, ప్రేరణలు తెగ అరిచారు. కానీ నామినేషన్స్‌లో సైలెంట్ అయిపోయారు. ఈ కన్నడ బ్యాచ్ అంతా కూడా ఒకే గ్రూపుగా ఆడుతున్నారని ఈ నామినేషన్స్ చూస్తే అర్థం అవుతుంది. కానీ మెగా చీఫ్ అవినాష్ తన పవర్‌తో కన్నడ బ్యాచ్‌కు దిమ్మ తిరిగేట్టు చేశాడు. నామినేషన్స్‌లో ఉన్న రోహిణిని కాపాడి నిఖిల్‌ను నామినేషన్‌లోకి నెట్టాడు.


అవినాష్ తీసుకున్న ఈ నిర్ణయం ఇంట్లో చాలా మందికి అంటే కన్నడ బ్యాచ్‌కి, పృథ్వీ తోక అయిన విష్ణుకి నచ్చలేదు. ఇక రోహిణి సేఫ్ అయిందనో ఏమో గానీ హరితేజ కడుపు మాత్రం చాలానే రగిలినట్టుంది. రోహిణి మీదున్న కడుపు మంట అంతా కూడా హరితేజ బయటకు చెప్పేసింది. రోహిణి ఉంటే ఈ సారి బయటకు వెళ్లేదని నిఖిల్, పృథ్వీ, హరితేజలు ముచ్చట్లు పెట్టుకున్నారు. రోహిణి అంటే వారికి చాలానే చిన్నచూపులా కనిపిస్తోంది. రోహిణి, తేజ, అవినాష్‌లకు నామినేషన్స్ అంటే వణుకు పుడుతుందని కామెడీలు చేసుకున్నారు నిఖిల్, పృథ్వీ, హరితేజ.


నిఖిల్ మమ్మల్ని ఏమీ హర్ట్ చేయలేదు. అతని ఉద్దేశం ఏంటో మాకు తెలుసు.. రోహిణి కంటే నిఖిల్ బాగా ఆడాడు.. నువ్వు చేసింది తప్పు అంటూ అవినాష్‌తో యష్మీ చెప్పుకొచ్చింది. ఇక బీబీ సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి కావాల్సిన రేషన్‌ను మెగా చీఫ్ అవినాష్ పట్టుకొచ్చాడు. ఆ తరువాత హు విల్ పిక్ మీ? అంటూ మూడు సూట్ కేసులను గార్డెన్ ఏరియాలో పెట్టాడు బిగ్ బాస్. వాటిని నబిల్, పృథ్వీ, రోహిణిలు పట్టుకున్నారు. ఇలా ధైర్యంగా పట్టుకునే సాహసం చేసినందుకు బిగ్ బాస్ అభినందనలు తెలిపాడు.


సూట్ కేసులను పట్టుకున్న ఆ ముగ్గురికీ మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారని గుడ్ న్యూస్ చెప్పారు. కాకపోతే వారి సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు కొన్ని చాలెంజ్‌లు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో లక్డీ కా పూల్ అనే ఛాలెంజ్‌ను ఆడేందుకు రోహిణి ముందుకు వచ్చింది. తన ప్రత్యర్థిగా హరితేజను రోహిణి ఎంచుకుంది. ఈ టాస్కులో హరితేజ మీద రోహిణి గెలిచి ఆ సూట్ కేసుని సొంతం చేసుకుంది. అందులో లక్షా 80 వేలున్నాయి. ఈ టాస్కు గెలిచినందుకు రోహిణికి ఓ పవర్ ఇచ్చాడు.


Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ రివ్యూ: హరితేజ - ప్రేరణ గొడవకు ఫుల్ స్టాప్... గౌతమ్-యష్మి గౌడ-నిఖిల్ నెవర్ ఎండింగ్ డిస్కషన్... ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే



ఆరెంజ్ సూట్ కేసును ఎవరో ఒకరికి ఇచ్చి కంటెండర్ రేసులోకి తీసుకు రావొచ్చు అని అన్నాడు. దీంతో ఆ సూట్ కేసుని ప్రేరణకు రోహిణి ఇచ్చేసింది. రెండో ఛాలెంజ్ కోసం నబిల్ ఇంట్లో వారందితోనూ డీల్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సారి ప్రత్యర్థని మెగా చీఫ్ కంటెండర్లు కాకుండా.. మిగిలిన ఇంటి సభ్యులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నబిల్ ప్లాన్‌ను చెడగొట్టేశాడు. అలా బెల్‌ను పట్టుకుని గౌతమ్.. తన ప్రత్యర్థిగా నబిల్‌ను తీసుకున్నాడు.


షేప్ యువర్ ఫ్యూచర్ టాస్కులో నబిల్, గౌతమ్ చాలానే ఫిజికల్ అయ్యారు. చివరకు ఈ టాస్కులో నబిల్ విన్ అయి లక్షా 2 వేలు ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు. తనకు వచ్చిన ఆరెంజ్ సూట్ కేసుని యష్మీకి ఇచ్చాడు. అలా మంగళవారం నాటి ఎపిసోడ్ ముగిసే సరికి రోహిణి, ప్రేరణ, నబిల్, యష్మీలు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు.


Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 61 రివ్యూ: యష్మిని టార్గెట్ చేసిన నిఖిల్... చిన్న పిల్లల్లా మారిన అవినాష్, ప్రేరణ - స్టామినా లేదంటూ ఏడ్చిన టేస్టీ తేజా