Bigg Boss 8 Telugu Episode 20 Day 19: ఆటలు ఆడటం అంటే సరసాలు ఆడినంత ఈజీ కాదు... సోనియా, అభయ్‌కి బిగ్ బాస్ మాస్ వార్నింగ్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ను బూతులు తిట్టి, అమర్యాదగా మాట్లాడిన అభయ్ నోటి దురుసుకు టీం మొత్తం బలైంది. అభయ్ టీంకు బిగ్ బాస్ పెద్ద శిక్ష వేశాడు.

Continues below advertisement

Bigg Boss 8 Telugu Episode 20 Day 19 : బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ కింగ్. తన మీదే నోరు పారేసుకుంటూ ఉంటే బిగ్ బాస్‌ చూసుకుంటూ ఊరుకుంటాడా?.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అభయ్‌కి బిగ్ బాస్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే నా రూల్స్ మాత్రమే పాటించాలని, తాను చెప్పింది చేయాలని అన్నాడు. అలా కాకుండా.. బిగ్ బాస్ కంటే తామే ఎక్కువ అని ఊహించుకునే కంటెస్టెంట్లు బయటకు వెళ్లండి అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సోనియా మెల్లిగా అభయ్‌ని గెలికింది. బిగ్ బాస్‌కు సారీ చెప్పు అని హింట్ ఇచ్చింది. నేను చెప్పిన కదా? అని అభయ్ అన్నాడు. దీంతో చివరకు అందరూ కలిసి బిగ్ బాస్‌కు సారీ చెప్పారు.

Continues below advertisement

ఇక బిగ్ బాస్‌ను బూతులు తిట్టి, అమర్యాదగా మాట్లాడిన అభయ్ నోటి దురుసుకు టీం మొత్తం బలైంది. ప్రభావతి టాస్కులో గెలిచిన నిఖిల్ టీం నుంచి క్లాన్ చీఫ్ కంటెండెర్లుఅయ్యేందుకు ఇద్దరిక అవకాశం వచ్చింది. రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తే వాళ్లే శక్తి క్లాన్ నుంచి కంటెండర్ అవుతాడని చెప్పారు. ఇక ఓడిన టీం నుంచి  ముగ్గురు కంటెండర్లు వస్తారని చెప్పాడు. దీంతో అభయ్ మళ్లీ నోరు జారాడు. అసలు ఏం చెబుతున్నాడు.. బిగ్ బాస్‌కు క్లారిటీ ఉందా? అని నోరు జారాడు. దీంతో అభయ్ టీంకు బిగ్ బాస్ పెద్ద శిక్ష వేశాడు.

Read Also: తారుమారైన ఓటింగ్... ఈ వారం ఎలిమినేట్ కానున్న టాప్ కంటెస్టెంట్, అభయ్ మాత్రం కాదండోయ్

అభయ్ నోరు జారడం వల్ల.. టీం నుంచి రావాల్సిన క్లాన్ చీఫ్ కంటెండర్లను కూడా క్యాన్సిల్ చేశాడు. అలా చివరకు రెడ్ ఎగ్ సోనియాకు ఇవ్వడంతో నిఖిల్, సోనియా కలిసి టాస్కులో పోటి పడ్డారు. నిదానమే ప్రధానం అనే ఈ టాస్కులో సోనియా ఓడిపోయింది. ఆటలు ఆడటం అంటే.. మాటలు మాట్లాడినంత ఈజీ అనుకుందో ఏమో.. చిన్నోడిని పెద్దోడిని పెట్టుకుని సరసాలు ఆడినంత ఈజీ అనుకుందో ఏమో.. చివరకు వచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయింది. సోనియా టాస్కుల్లో వీక్ అని మరోసారి నిరూపించుకుంది. ఆటలు కాదు.. కేవలం మాటలే అని మరోసారి అందరికీ ఫ్రూవ్ చేసింది సోనియా.

ఇక రెడ్ ఎగ్ తనకు ఇవ్వలేదని సీత వెక్కి వెక్కి ఏడ్చింది. నాకు ఎందుకు రెడ్ ఎగ్ ఇవ్వలేదని పృథ్వీ అడిగాడు. నీకు కోపం ఎక్కువగా.. కామ్ అండ్ కంపోజ్డ్ ఉండే కంటెస్టెంట్లకు ఇవ్వాలని అనుకున్నా.. అందుకే సోనియాకు ఇచ్చా అని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక చీఫ్ అవుతానని మణికంఠ ఆశలు గల్లంతయ్యాయి. ఇక సోనియా, నిఖిల్ ట్రాక్ కూడా బాగానే చూపించారు. సోనియా పదే పదే తన మీద పెత్తనం చూపించినట్టుగా అనిపిస్తోందని తనకు నచ్చడం లేదని నిఖిల్ అన్నాడు.. తినమన్నప్పుడు తినాలా? ఆమె సిగరెట్లు బంద్ చేయమంటే చేయాలా? ఆ అలవాటు ఒకేసారి ఎలా పోతుంది? అంటూ ఇలా సోనియా గురించి అభయ్‌కి నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Continues below advertisement
Sponsored Links by Taboola