బిగ్ బాస్ సీజన్ 8 డే 19 కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అయితే ఇందులో లవ్ బర్డ్స్ గా చెప్పుకుంటున్న సోనియా ఆకుల, నిఖిల్ మధ్య గొడవ మొదలైనట్టుగా ప్రోమోలో చూపించారు. అరే మళ్లీ ఇద్దరూ గొడవ పడుతున్నారా అనుకునే లోపే నిఖిల్ తన బుద్ధిని బయట పెట్టాడు. గేమ్ కోసం ఎంతగానో కష్టపడిన మిగతా అందరు కంటెస్టెంట్స్ ని పక్కన పెట్టి తనకున్న పవర్ తో సోనియాకి ఫేవర్ చేశాడు. తాజా ప్రోమోలో జరిగిన విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 


నిఖిల్ సుద్దపూస వేషాలు
ప్రోమో మొదట్లోనే నిఖిల్, సోనియా కిచెన్ లో కనిపించారు. అయితే ముందుగా సోనియా "తనకు ఆకలేస్తుంది అంట" అని చెప్పగా, వెంటనే నిఖిల్ "గొడవ తర్వాత పెట్టుకుందువు గాని ఫస్ట్ తిందువురా" అని బుద్ధిగా పిలిచాడు. కానీ వెంటనే సోనియా "నీకు అంత ఉంటే తినేటప్పుడు అడగాల్సింది కదా" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగినట్టుగా చూపించారు ప్రోమోలో. ఆ తర్వాత నిఖిల్ అభయ్ దగ్గరకు వెళ్లి "నేను ఎలా కనిపిస్తున్నాను ఆమె కళ్ళకి. నా పర్సనల్ ప్లేస్ లో, నేను ఎలా ఉండాలో దాన్ని నువ్వు జడ్జ్ చేసి ఫన్ చేస్తున్నప్పుడు అందరి ముందు నాకు ఇన్సల్ట్ కాదా?" అని అడిగాడు. నెక్స్ట్ సీన్ లో అభయ్,  సోనియా కలిసి కనిపించారు. సోనియా మాట్లాడుతూ "హాల్ మొత్తం తిన్న తర్వాత వీడొచ్చి నిలబడి తింటాడు సుద్దపూస. ఇప్పుడు వచ్చి తినలేదా అని నన్ను అడుగుతున్నాడు" అంటూ ఏం జరిగిందో వివరించింది. నెక్స్ట్ బెడ్ రూమ్ లో నిఖిల్ తింటూ "నాకు ఇంకొకరితో గొడవ ఉందనుకో.. జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆ గొడవను చూపించకూడదు అనిపిస్తుంది" అని కిరాక్ సీత, విష్ణు ప్రియతో చెప్పాడు. మరోవైపు సోనియా "ఎమోషనల్ రైడ్ చేస్తాడు చూడు ఇప్పుడు దాన్ని... అది మస్తు కోపం వస్తది" అని అభయ్ తో చెప్పింది. 






Read Also : Bigg Boss 8 Telugu: తారుమారైన ఓటింగ్... ఈ వారం ఎలిమినేట్ కానున్న టాప్ కంటెస్టెంట్, అభయ్ మాత్రం కాదండోయ్



సోనియాకు నిఖిల్ ఫేవర్, సీత అలక 
ఆ తర్వాత బిగ్ బాస్ అందర్నీ కూర్చోబెట్టి ప్రభావతి ఇచ్చిన రెడ్ కలర్ గుడ్డు ఎవరి దగ్గర ఉందని ప్రశ్నించాడు. నిఖిల్ టీం తమ దగ్గరే ఉందని చెప్పడంతో "ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గరగా ఉంటే వాళ్లు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు" అని చెప్పారు. ఆ తర్వాత బెడ్ రూమ్ లో కిరాక్ సీత, నైనిక, యష్మి గౌడ, నాగ మణికంఠ, నిఖిల్ మాట్లాడుకుంటూ ఉండగా.. సోనియా వచ్చి "ఇంతకు ముందు అట్ల అన్నందుకు సారీ" అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ "నిఖిల్ మీరు ఎవరికి ఆ రెడ్ ఎగ్ ఇచ్చి శక్తి టీం క్లాన్ చీఫ్ పదవికి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు?? అని అడిగాడు. నిఖిల్ క్షణం కూడా ఆలోచించకుండా సోనియా పేరు చెప్పాడు. దెబ్బకి హౌస్ మొత్తం షేక్ అయింది. అనుకున్నదే అయినప్పటికీ కిరాక్ సీత గుక్క పెట్టి ఏడ్చింది.


Read Also : Bigg Boss 8 Telugu Day 19 - Promo: అందరికీ ప్రాబ్లం ఆ ఒక్కడే... గెట్ అవుట్ అంటూ గేట్లు ఓపెన్ చేసి హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్