బిగ్ బాస్ 8 తెలుగులో గురువారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ దారుణంగా గొడవలతో కొనసాగింది. ఒకరినొకరు కొట్టుకోవడమే కాకుండా బూతులతో విరుచుకుపడ్డారు. మొత్తానికి హౌస్ లో ఇచ్చిన గుడ్ల టాస్క్ లో శక్తి టీం విన్ అయ్యింది. ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వీక్ మధ్యలో గమనిస్తే ఒక రకంగా ఉన్న ఓటింగ్ ఇప్పుడు పూర్తిగా తారుమారు అయ్యింది. హౌస్ లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా షాకింగ్ ఎలిమినేషన్ లో టాప్ కంటెస్టెంట్ బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.
టాప్ కంటెస్టెంట్ షాకింగ్ ఎలిమినేషన్
ఈవారం ఎలిమినేషన్ లిస్ట్ లో 8 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. విష్ణు ప్రియ, నాగ మణికంఠ, కిరాక్ సీత, పృథ్వి, నైనిక, అభయ్ నవీన్, యష్మి గౌడ, ప్రేరణ కంబం ఆ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇప్పుడున్న ఓటింగ్ ప్రకారం విష్ణు ప్రియ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఇక ఆ తర్వాత మణికంఠ టాప్ ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు. మొత్తానికి ఇద్దరూ సేఫ్ గానే ఉన్నారు. కానీ మిగిలిన ఆరుగురు పృథ్వీ, అభయ్ నవీన్, నైనిక, కిరాక్ సీత, యష్మి గౌడ, ప్రేరణ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ గనక జరిగితే ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు టాప్ లఓ ఉంటుందని అందరూ అనుకుంటున్న నైనిక. నిజానికి నైనిక మంచి అమ్మాయి, అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా. కానీ ఈ వీక్ టాస్క్ లలో ఆమె పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించలేదు ఫుటేజ్ లో. అంటే ఫుటేజ్ లో తక్కువ స్పేస్ దొరికిందంటే వాళ్ళు ఎలిమినేట్ కావడం పక్కా. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ వారం నైనిక షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని టాక్ నడుస్తోంది.
అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నా సేఫే
ఇక డేంజర్ జోన్ లో ఉన్న మరో కంటెస్టెంట్ అభయ్ నవీన్. అతను ఏకంగా బిగ్ బాస్ ను తిట్టి వార్తలో నిలిచాడు. అయితే చీఫ్ గా తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించకుండా, మరోవైపు తన మాట తీరుతో తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకునేవారు హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ నార్మల్ ఎలిమినేషన్ జరిగితే అభయ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అతన్ని తన కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు కాబట్టి నిఖిల్ తన దగ్గర ఉన్న రెడ్ కలర్ ఎగ్ తో సేవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ వీకెండ్ అందరూ అనుకున్నట్టుగా నైనికానే ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి.