వేణు స్వామికి వివాదాలు కొత్త కాదు. ఆస్ట్రాలజీ పేరుతో ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన మీద నమ్మకం ఉంచిన సెలబ్రిటీలు సైతం ఉన్నారు. రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హాయితీ వంటి హీరోయిన్లు మొదలుకొని పలువురు రాజకీయ నాయకులు వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారు. ఆ క్రేజ్ వాడుకుని ఆయన టీవీ స్క్రీన్ మీద, రియాలిటీ షోలో సందడి చేయాలని ప్లాన్స్ వేశారని టాక్.


ప్రశంసలు, విమర్శలు పక్కన పెడితే వేణు స్వామి ప్రజలలో పాపులర్ అయిన పర్సన్. అటువంటి వ్యక్తులకు బిగ్ బాస్ షో రెడ్ కార్పెట్ పరుస్తుంది. వేణు స్వామి కూడా బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టాలని ఆశపడినట్టు తెలుస్తోంది.‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఆ అవకాశాలు లేకుండా పోయాయని టీవీ ఇండస్ట్రీలో వినబడుతోంది. అయితే, అసలు నిజం ఏమిటంటే...


వేణు స్వామికి 'బిగ్ బాస్' నుంచి ఆఫర్ వచ్చిందా?
బిగ్ బాస్ షోలో ఎవరెవర్ని తీసుకోవాలి? అని కొన్ని రోజుల ముందు సన్నాహాలు మొదలు అవుతాయి. 'బిగ్ బాస్ 8 తెలుగు' ప్రోమో విడుదలైన నేపథ్యంలో ఆల్రెడీ కంటెస్టెంట్స్ గురించి ఊహాగానాలు మొదలు అయ్యాయి. అందులో వేణు స్వామి పేరు కూడా వినిపించింది. 


'బిగ్ బాస్' టీం నుంచి వేణు స్వామిని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఆయనకు షో నుంచి ఆఫర్ వచ్చిందా? అంటే... అందులో నిజం లేదని స్టార్ మా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కరోనా సమయంలో బిగ్ బాస్ ఇంటిలోకి పంపించే కంటెస్టెంట్లను పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి క్వారంటైన్ లో ఉంచారని, ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్ అని తేలితే... వాళ్ళకు చికిత్స అందించడంతో పాటు ఆ తర్వాత ఇంటికి పంపించిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వివరించారు. ప్రస్తుతానికి స్టార్ మా ప్రాపబిలిటీస్ లిస్టులో వేణు స్వామి పేరు లేదట. 



చైతన్య, శోభిత ఇష్యూతో సంబంధం లేదు!
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం తర్వాత వేణు స్వామి మీద ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం, టీవీ ఛానల్స్ డిబేట్స్, తనను ఐదు కోట్లు డిమాండ్ చేశారని వేణు స్వామి చేసిన ఆరోపణలు తదితర పరిణామాలకు... బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికకు అసలు ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. ముందు నుంచి వేణు స్వామి పేరును పరిగణలోకి తీసుకోలేదట. అయితే... బిగ్ బాస్ షోలోకి వెళ్లే ప్రయత్నం చేసిన వేణు స్వామి, ఒకవేళ అవకాశం వస్తే తనకు సపోర్ట్ చేయడానికి బయట ఒక ఆర్మీని రెడీ చేశారట. అందరికీ పార్టీ ఇచ్చారట. అదీ సంగతి! 


Also Read: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి... మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?


ఇప్పుడు స్టార్ మాలో పరిస్థితి చూస్తే... వేణు స్వామికి బిగ్ బాస్ డోర్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వేణు స్వామికి బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లే అవకాశం రాదు. 


Also Readఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?