Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచాడు ఒక కామన్ మ్యాన్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. ఒక రైతుబిడ్డగా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యి.. ఆ షోలో రైతులు అందరికీ నిదర్శనంగా నిలిచాడు. బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ప్రేక్షకులకు ఎంతోకొంత తెలిసినవారే కావడంతో వారికి ఓట్లు పడడం పెద్ద విషయం కాదు. కానీ ఎక్కువగా ప్రేక్షకులకు తెలియని పల్లవి ప్రశాంత్‌కు ఓట్లు పడడం కోసం తను టాస్కుల్లో కష్టపడి ఆడాడు. న్యాయంగా చాలా గేమ్స్‌లో గెలిచాడు. అందుకే ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడు. ఇక విన్నర్‌గా నిలిచిన తర్వాత కూడా తను మొదటినుంచి అన్న మాట మీదే ఉంటానని ప్రశాంత్ మరోసారి గుర్తుచేశాడు. 


నాగార్జునపై పల్లవి ప్రశాంత్ కవిత


టాప్ 2 కంటెస్టెంట్స్‌గా మిగిలిన పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లను బిగ్ బాస్ హౌజ్ నుంచి స్టేజ్‌పై తీసుకొచ్చారు నాగార్జున. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ చేయి పట్టుకొని తనను విన్నర్ అని అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంతోషంతో నాగార్జున కాళ్లపై పడ్డాడు ప్రశాంత్. తన తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పైకి వచ్చారు. ప్రశాంత్ తల్లి కూడా సంతోషంతో నాగార్జున కాళ్లపై పడ్డారు. విన్నర్ అయిన తర్వాత ప్రశాంత్‌ను మాట్లాడమని చెప్పగా.. ‘‘ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చెబుతా. ప్రతి రోజు ఇక్కడనే తిరిగినా. తినని రోజులు కూడా ఉన్నాయి. ఇంట్లో చెప్పలేదు. వాళ్లకు తిన్నానని అబద్ధం చెప్పేవాడిని. ముందుకు నడువు, నేను వెనక ఉంటా అని బాపు మాట ఇచ్చాడు. సార్‌తో పరిచయమైంది. నాగార్జునను చూడగానే మాట రాలేదు’’ అంటూ నాగార్జునపై ఎమోషనల్‌గా కవిత చెప్పాడు ప్రశాంత్.


రైతుకే ఇస్తా..


‘‘రూ.35 లక్షలను రైతుల కోసం ఇస్తాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్క రైతుకు ఇస్తా. పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా. మాట తప్పేదే లేదు. మళ్లీ వచ్చా అంటే తగ్గేదే లే. రైతుల కోసం ఆడినా, కారు నాన్నకు ఇస్తా, నక్లెస్ అమ్మకు ఇస్తా. డబ్బు జనాలకు ఇస్తా’’ అంటూ మరోసారి బిగ్ బాస్‌లోకి వచ్చింది డబ్బు కోసం కాదని గుర్తుచేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ గొప్ప మనసుకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇక తను విన్నర్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. శివాజీ ఫ్యాన్స్ సైతం ప్రశాంత్ విన్నర్ అవ్వడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తను విన్నర్ అవ్వకపోయినా.. తన శిష్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో సంతోషపడ్డాడు శివాజీ.


అందరూ ఎమోషనల్


పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అవ్వడంతో తను హౌజ్‌లో ఎలా ఉన్నాడు, ఎలా ఆడాడు అన్న విషయాలను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా.. తనకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్‌లో ఉంటూ.. నామినేషన్స్ సమయంలో మాత్రమే వాదిస్తూ ఉండేవాడు ప్రశాంత్. ఇక టాస్కులు విషయానికొస్తే.. పల్లవి ప్రశాంత్‌కు ఉన్నంత ఫోకస్ మరే ఇతర కంటెస్టెంట్‌ను లేదని.. తన తోటి కంటెస్టెంట్సే ఒప్పుకున్నారు. అందుకే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన సందర్భంగా.. తన తోటి మాజీ కంటెస్టెంట్స్ అంతా వచ్చి తనకు కంగ్రాట్స్ తెలిపారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు తన తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పై ఎమోషనల్ అయ్యారు.


Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?