బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ ను అరియానా ఇంటర్వ్యూ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సభ్యులందరినీ ఇంటర్వ్యూ చేసింది అరియానా. ఇప్పుడు సిరిని కూడా తన ప్రశ్నలతో ఓ ఆట ఆడేసుకుంది.ముందుగా షణ్ముఖ్ ఫొటో స్క్రీన్ పై చూపించి అతడి గురించి చెప్పమని అడగ్గా.. 'ఏం చెప్పాలి అందరికి తెలుసు కదా..' అని అనగా.. వెంటనే అరియానా వెళ్లి సిరిని హగ్ చేసుకుంటూ.. 'ఫ్రెండ్లీ హగ్ రా.. ఆంటీ ఫ్రెండ్షిప్ హగ్ ఓకే' అంటూ షణ్ముఖ్ డైలాగ్ వేసింది. 'గట్టిగా వెళ్లినట్లు ఉన్నాయ్ గా హగ్గులు' అంటూ నవ్వేసింది సిరి.
'బయటకు వెళ్లినప్పుడు ఐలవ్యూ చెప్పావ్..?' అని అరియానా మెల్లగా సిరిని అడగ్గా.. 'ఫ్రెండ్స్ కి ఐలవ్యూ చెప్పరా..?' అని రివర్స్ లో ప్రశ్నించింది. 'సీజన్ 5 టాప్ 5లో ఉన్న ఒక్క అమ్మాయివి నువ్.. ఆ ఫీలింగ్ ఎలా ఉందని..?' అడగ్గా.. 'చాలా హ్యాపీగా ఉంది.. ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది సిరి.
'మీ ప్రయాణంలో ఒంటరిగా ఆడారా..? లేక సపోర్ట్ తీసుకొని ఆడారా..?' అనే ప్రశ్నకు సమాధానంగా.. 'నేను ఒంటరిగానే ఆడాను' అని చెప్పింది సిరి. 'షణ్ముఖ్ చాలా సార్లు వద్దు, దూరంగా ఉండు.. అని నిన్ను అవైడ్ చేసినట్లు కనిపించింది..' అని అరియానా అనగా.. 'తన ఇంటెన్షన్ ఏంటంటే..?' అని సిరి చెప్పే ప్రయత్నం చేయగా.. 'నీ ఇంటెన్షన్ చెప్పవే బంగారం.. షన్ను షన్ను షన్నుయేనా..?' అని కౌంటర్ వేసింది.
'రవిని నామినేట్ చేసింది మీరు.. ఆ తరువాత నీకోసం ఆడుతున్నాం రవి అని అన్నది మీరే..? ఎందుకో తెలుసుకోవచ్చా..?' అని అరియనా ప్రశ్నించగా.. 'రవి ఎలిమినేషన్ అనేది పెద్ద షాక్ మాకు' అంటూ చెప్పుకొచ్చింది. సన్నీని నిజంగానే టార్గెట్ చేసేదానివా..? అనే ప్రశ్నకు.. 'లేదు.. ప్రామిస్ చేసి చెప్తున్నా.. సన్నీని టార్గెట్ చేయలేదు.. మా ఇద్దరికీ ప్రతీ టాస్క్ లో గొడవ అవుతుంటే ఫ్రెండ్షిప్ ఎక్కడ నుంచి వస్తాది..?' అని చెప్పగా.. 'షణ్ముఖ్ తో కూడా గొడవ పడుతుంటావ్ కదా..?' అని సిరిని ఇరకాటంలో పెట్టేసరికి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. సడెన్ గా మోజ్ రూమ్ లోకి వెళ్లి షణ్ముఖ్ ని ముద్దుపెట్టుకోవడం గురించి కూడా ప్రశ్నించింది అరియానా. ఇక ఫైనల్ గా 'చోటు..? లేక షణ్ముఖ్ తో స్నేహం.. ఈ రెండింటిలో ఏదో ఒకటే చూజ్ చేసుకోవాల్సి వస్తే ఏం చూజ్ చేస్తావని సిరిని ప్రశ్నించింది అరియానా. దీనికి ఆమె ఎలాంటి సమాధానం చెబుతుందో పూర్తి ఎపిసోడ్ లో తెలియనుంది.
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి