బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 5 కూడా ముగిసిపోయింది. మరో రెండు నెలల్లో కొత్త సీజన్ ను మొదలుపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు నాగార్జున. ఇదిలా ఉండగా.. సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీ నిలిచారు. మొదటినుంచి కూడా తన ఆటతీరుతో, ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించిన సన్నీ ట్రోఫీ అందుకోవడంతో అతడి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 


అయితే ఈ షోతో సన్నీ రెమ్యునరేషన్ గా ఎంత సంపాదించారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో నిర్వాహకులు విన్నర్ అయిన సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీను చెక్ రూపంలో అందించారు. దీంతో పాటు సువర్ణకుటీర్ వారి తరఫున రూ.25 లక్షల విలువైన ప్లాట్ కూడా సన్నీకి దక్కింది. అలానే.. రెండు లక్షల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్ ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు రూ.77 లక్షలు గెలుచుకున్నాడు సన్నీ. 


ఇది కాకుండా.. హౌస్ లో ఉన్నంతకాలం రెమ్యునరేషన్ గా అతడు పాతిక నుంచి ముప్పై లక్షలు సంపాదించుకున్నాడని సమాచారం. అంటే మొత్తం కలుపుకుంటే కోటికి పైగానే. కానీ ఈ మొత్తంలో సన్నీకి చేతికొచ్చేది మాత్రం కొంతే అని తెలుస్తోంది.  దానికి కారణం.. ఏదైనా షోలో రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తం గెలిస్తే 31.2% పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రూ.50 లక్షల ప్రైజ్ మనీలో రూ.15.60 లక్షలు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లిపోతుంది. దీంతో సన్నీ ప్రైజ్ మనీలో రూ.34.40 మాత్రమే అందుకుంటాడు. అది కాకుండా.. మిగిలిన డబ్బులో కూడా కొంతమొత్తాన్ని టాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సన్నీ కోటి గెలిచినా.. అతడి చేతికి మాత్రం అంత మొత్తం వచ్చే ఛాన్స్ లేదు.


సన్నీ బ్యాక్ గ్రౌండ్..: 1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. ఖమ్మంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసుకున్న సన్నీ.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో ఉన్న సన్నీకి తన తల్లి కళావతి కూడా సపోర్ట్ చేయడంతో ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడు. చిన్న వయస్సులో సన్నీ వేసిన 'అల్లాద్దీన్' అనే నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఓ ఛానెల్ లో 'జస్ట్ ఫర్ మెన్' అనే టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే ఛాన్స్ రావడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా కొంతకాలం పని చేశాడు. పాపులర్ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'కళ్యాణ వైభోగం' అనే  సీరియల్ లో ముందుగా జయసూర్య అనే ప్రధానపాత్రలో సన్నీని తీసుకున్నారు. తన నటనతో అభిమానులను సంపాదించుకున్న సన్నీ.. ఆ తరువాత కొన్ని కారణాలతో సీరియల్ నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే సన్నీ హీరోగా 'సకలగుణాభిరామ' అనే సినిమా విడుదల కానుంది. బిగ్ బాస్ హౌస్ లోని వెళ్లకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ సన్నీ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత సినిమాను రిలీజ్ చేద్దామని వెయిట్ చేశారు. ఇప్పుడు సన్నీ విన్నర్ గా ట్రోఫీ అందుకొని మరీ బయటకొచ్చాడు కాబట్టి కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. 


Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..


Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్



 


Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?



Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి