బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారం పూర్తి చేసుకోబోతుంది. ఎలిమినేషన్ ప్రక్రియతో వీకెండ్ ఎపిసోడ్స్ చాలా ఇంటరెస్టింగ్ గా మారాయి. ఎలిమినేషన్ ఉన్న ఎనిమిది మందిలో నలుగురు సేఫ్ జోన్ లోకి రాగా.. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌస్ ని విడిచిపెట్టి వెళ్లబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పటిలానే ఆదివారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ఇందులో హౌస్ మేట్స్ అందరూ కలిసి నాగార్జునకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడతా' విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి అందులోని పాటలకు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. వాళ్ల పెర్ఫార్మన్స్ చూసిన నాగ్ గూస్ బంప్స్ వచ్చాయని.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు.  


Also Read:త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్


వాళ్లతో ఓ గేమ్ ఆడించారు నాగార్జున. ఈ క్రమంలో 'విశ్వని అన్నయ్య అంటే అన్నావు కానీ.. సన్నీని మాత్రం అన్నయ్య అనొద్దు' అంటూ ప్రియాంకతో సరదాగా అన్నారు నాగార్జున. విశ్వ-ప్రియాంక డాన్స్ చేయగా.. 'మీ ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నంతసేపు నేను మానస్ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాను' నాగ్ కామెంట్ చేయగా.. మానస్ నవ్వేశాడు. 


యానీ మాస్టర్ సేఫ్..


నామినేషన్ లో ఉన్న వారి చేతిలో బాగ్స్ పెట్టి వాటిలో ఎవరి బ్యాగ్ ఎక్కువ బరువు ఉంటుందో వాళ్లు సేఫ్ అవుతారని నాగార్జున చెప్పారు. ఈ టాస్క్ లో లోబో బ్యాగ్ వెయిట్ 4.2 కిలోలు, నటరాజ్-4.7 కిలోలు, సిరి-4.3 కిలోలు, యానీ మాస్టర్-5.4 కిలోలు వచ్చాయి. అందరికంటే ఎక్కువ వెయిట్ యానీ మాస్టర్ కి రావడంతో ఆమె సేఫ్ అని ప్రకటించారు. 



దాక్కో దాక్కో మేక..


హౌస్ మేట్స్ తో 'దాక్కో దాక్కో మేక' అనే ఆట ఆడించారు నాగార్జున. ఈ క్రమంలో మేకగా ఎంపిక చేసిన హౌస్ మేట్ పరుగెడుతూ ఉండగా.. పులిగా ఎంపిక చేసిన హౌస్ మేట్ మేకను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో ప్రియాంక.. మానస్‌ని పట్టుకోవడానికి ఆయన వెంట పరిగెత్తగా.. అదుపుతప్పిన ఆయన ఒక్కసారిగా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోవడంతో నాగ్‌ షాక్‌ అయ్యారు. 
సిరి సేఫ్.. నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ చేతిలో మూడు కవర్లు పెట్టారు. ఎవరికైతే ఫుల్ హార్ట్ వస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు అని చెప్పారు నాగ్. ఈ టాస్క్ లో సిరికి ఫుల్ హార్ట్ రావడంతో ఆమె సేఫ్ అయింది. 


ఆ తరువాత గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు కుర్చీలపై నటరాజ్ మాస్టర్, లోబోలను కూర్చోమని చెప్పారు నాగార్జున. ఈ టాస్క్ లో లోబో సేఫ్ అవ్వగా.. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఏడ్చేశారు. యానీ మాస్టర్ అయితే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయింది. లోబో.. నటరాజ్ మాస్టర్ ని పట్టుకొని ఏడ్చేశాడు. 


ఆ తరువాత స్టేజ్ పైకి వెళ్లిన నటరాజ్ మాస్టర్ తో ఓ గేమ్ ఆడించారు నాగార్జున. జంతువుల ఫొటోలతో ఉన్న బోర్డుని ఆయన ముందుంచి హౌస్ మేట్స్ కి సూటయ్యే జంతువుల ఫోటోల ముందు హౌస్ మేట్స్ ఫోటోలు పెట్టమని చెప్పారు. ఇందులో ఎవరెవరికి ఏ ఏ జంతువు ఇచ్చారంటే..



  • పాము- సిరి(ఎవరి జోలికి వెళ్లదు.. ఎవరైనా తన జోలికి వస్తే ఊరుకోదు)

  • ఎలుక-లోబో(కిచెన్ లోకి దూరి తినేస్తుంటుంది)

  • ఊసరవెల్లి-విశ్వ(భయపడడం మానేసి గేమ్ ఆడు.. పక్క వాళ్ల ఇంప్రెషన్ కోసం ప్రయత్నించకు)

  • మొసలి-శ్రీరామ్(చెరువులో మొసలి ఉంటుంది.. జింక ఏదైనా వస్తే.. లటుక్కున లాగేసుకుంటాది. అలా శ్రీరామ్ కూడా హౌస్ లో మూడోవారం నుంచి రైజ్ అయ్యాడు)

  • చిలక-ప్రియాంక(అందరికీ అద్భుతంగా వంట చేసి వడ్డిస్తుంటుంది.. సూపర్ పెర్సన్)

  • గాడిద-మానస్(ఎవరేం అడిగినా.. అన్ని పనులు చేస్తాడు.. అర్ధరాత్రి కూడా వంటగదిలో పనులు చేస్తుంటాడు)

  • గుంటనక్క-రవి(హౌస్ లో ఉన్న తెలివైన వాళ్లలో రవి ఒకడు)


Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి