Bigg Boss 5 Telugu: సింహంతో వేట.. నాతో ఆట రెండూ ప్రమాదమే.. నటరాజ్ మాస్టర్ ఫైర్!

మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు నాలుగో వారంలోకి ఎంటర్ అయింది.

Continues below advertisement

మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ అంతా నటరాజ్ మాస్టర్ పై ఫైర్ అవుతూ కనిపించారు.

Continues below advertisement

Also Read: క్రేజీ అప్డేట్.. మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ ఫైట్.. 

'నేను చిన్న బస్తీలో ఉంటా.. బస్తీ లైఫ్ స్టైల్ వేరు.. విల్లాస్ లైఫ్ స్టైల్ వేరు’ అని లోబో.. షణ్ముఖ్ కి చెబుతుండగా.. 'అందరూ కిందనుంచే వచ్చారు.. ప్రతిసారి కింద నుంచి వచ్చా.. బస్తీ నుంచి వచ్చా అని చెప్పొద్దు అది తప్పు' అని షణ్ముఖ్ ఫైర్ అయ్యాడు. 'లోబో సింపతీ కోసం ట్రై చేస్తున్నాడని' సిరి కూడా అతడినే నామినేట్ చేసింది. 'ఇక్కడికి మనం గేమ్ ఆడటానికి వచ్చాడు.. గేమ్ ఆడదాం' అంటూ కామెంట్ చేసింది సిరి. 

ఆ తరువాత మానస్ కూడా నటరాజ్ మాస్టర్ పై మండిపడ్డాడు. 'మీకు ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పేయండి.. అంతేతప్ప నన్ను గిల్లి గిచ్చి వదిలేయొద్దు' అని అన్నాడు. హమీద కూడా నటరాజ్ మాస్టర్ నే నామినేట్ చేసింది. ఇక విశ్వ-నటరాజ్ మాస్టర్ ల మధ్య అయితే మాటల యుద్ధం నడిచింది. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదమే' అంటూ సినిమా డైలాగులు కొట్టారు నటరాజ్ మాస్టర్. 'అవన్నీ నీ దగ్గర పెట్టుకో' అంటూ విశ్వ కోపంగా చెప్పాడు. ప్రోమో చివర్లో.. 'ఇది తప్పు మాస్టర్' అని కాజల్ అనడంతో ఆమెకి వేలు చూపిస్తూ ఏదో సైగ చేశారు నటరాజ్ మాస్టర్. 

Continues below advertisement