బిగ్ బాస్ సీజన్ 5 రేపటి ఎపిసోడ్ తో పూర్తి కానుంది. ప్రస్తుతం హౌస్ లో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రం విజేత కానున్నారు. ఈ వారం మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీలతో, ఫన్నీ గేమ్ తో ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్.. ఈరోజు ఎపిసోడ్ కి గత సీజన్లలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న కొందరు ఎక్స్ హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పంపించారు.


ఫస్ట్ సీజన్ నుంచి శివబాలాజీ, హరితేజ ముందుగా కన్ఫెషన్ రూమ్ నుంచి హౌస్ మేట్స్ తో మాట్లాడారు. వారిద్దరూ కలిసి టాప్ 5 కంటెస్టెంట్ ని ఇమిటేట్ చేస్తూ.. అందరినీ నవ్వించారు. ఆ తరువాత శివబాలాజీ.. షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ.. 'ఎక్కువ ఆలోచించొద్దు.. అన్నీ మర్చిపో..' అని అన్నాడు. దానికి హరితేజ 'ట్రోఫీ కూడా మర్చిపో అని చెప్పి ఆయన తీసుకెళ్లిపోయాడు. లాస్ట్ కి ఎలా అయిపోయిందంటే శివబాలాజీ గెలిచాడంటూ చప్పట్లు కొడుతున్నాను' అంటూ పంచ్ వేసింది.


టాప్ 5 కంటెస్టెంట్స్ తో హరితేజ సాంగ్ గెస్ చేసే గేమ్ ఆడింది. దీని హౌస్ మేట్స్ డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఎప్పటిలానే షణ్ముఖ్-సిరి జంటగా డాన్స్ చేస్తుండగా.. మిగిలిన ముగ్గురు తమ డాన్స్ లు వేసుకుంటూ కనిపించారు. అది చూసిన హరితేజ.. 'వాళ్ల ముగ్గురి పరిస్థితి చూడు' అంటూ ఫన్నీగా డైలాగ్ వేసింది. ఆ తరువాత శ్రీరామ్ 'నిన్న బిగ్ బాస్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ అని సిరిని పంపించేస్తే చాలా సంతోషపడ్డాం. కానీ ఇంతలోనే కన్ఫెషన్ రూమ్ నుంచి షన్ను అని అరుచుకుంటూ బయటకొచ్చింది' అంటూ సిరిని ఇమిటేట్ చేస్తూ చెప్పాడు. తన హరికథతో టాప్ 5 కంటెస్టెంట్స్ క్యారెక్టర్స్ ని చెప్పే ప్రయత్నం చేసింది హరితేజ. 


సెకండ్ సీజన్ నుంచి గీతామాధురి, రోల్ రైడా కన్ఫెషన్ రూమ్ లో నుంచి హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా రోల్ రైడా.. 'బయట ఎక్కడన్నా ఏదైనా ఎగురుతుంటే అది ట్రాక్టర్ ట్రాక్టర్ అని అంటున్నారు' అంటూ సిరిని ఆటపట్టించాడు. సన్నీ-మానస్ ఫ్రెండ్షిప్ ని పొగిడారు. ఆ తరువాత కంటెస్టెంట్స్ తో ఫిక్షన్ సాంగ్ గేమ్ ఆడించారు. 


హగ్ గురు అయిపోతాడు మనోడు..: నిన్నటినుంచి వీరి ముగ్గురికి బాగా కాలుతుందని.. నెక్స్ట్ నుంచి ఒక్కొక్కరికి రాడ్స్ వేస్తానని.. శ్రీరామ్, సన్నీ, మానస్ లను ఉద్దేశిస్తూ షణ్ముఖ్.. సిరితో అన్నాడు. 'ఇది రెస్పాండ్ అయ్యే టైం కాదు.. విని పడేసే టైం' అని చెప్పింది సిరి. ఏ రిలేషన్ అయినా హౌస్ వరకే.. అంటూ సిరి చెబుతూ షణ్ముఖ్ మీద అలిగింది. ఎప్పటిలానే హగ్ ఇచ్చి ఆమెని కూల్ చేశాడు షణ్ముఖ్. అది చూసిన సన్నీ.. 'ఏంట్రా వీళ్లు.. ఎప్పుడు ఏం ఎమోషన్ వస్తాదో.. హగ్ గురు అయిపోతాడు చూడు మనోడు బయటకి వెళ్లాక' అని మానస్ తో కామెంట్ చేశాడు సన్నీ. 


ఆ తరువాత సీజన్ 3 నుంచి శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్ లు కన్ఫెషన్ రూమ్ నుంచి హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఒక్కొక్కరి క్యారెక్టర్ ని పొగుడుతూ కామెంట్స్ చేశారు. ఇక హౌస్ మేట్స్ తో హీలియం బెలూన్స్ ను పీల్చమని చెప్పి.. వారితో డైలాగ్స్ చెప్పించారు. ఈ టాస్క్ అంతా ఫన్నీగా సాగింది. అలానే టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడించారు. 


సీజన్ 4 నుంచి అరియనా, బిగ్ బాస్ లు కన్ఫెషన్ రూమ్ నుంచి హౌస్ మేట్స్ తో మాట్లాడారు. 'నెవెర్ ఐ హేవ్ ఎవర్' అనే గేమ్ ఆడించారు. డేటింగ్ యాప్ లో ఎవరినైనా కలిశారా..? అని హౌస్ మేట్స్ ని ప్రశ్నించగా.. 'ఎవరైనా ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కానీ ఆమె నా ముచ్చట వదిలేసి తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెబుతూ పోయింది. అదొక పంచాయితీ అయింది' అని సన్నీ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరూ డాన్స్ లు చేస్తూ.. బాగా ఎంజాయ్ చేశారు. 


Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...


Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?



Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి