Bigg Boss Telugu 6: ఈ ఎపిసోడ్లో బాలాదిత్య, ఇనయా ఇద్దరూ తీవ్రంగా బాధపడ్డారు. బాగా ఏడ్చారు. ఆ ఏడుపుకి అర్థం కూడా ఉండడంతో ప్రేక్షకులు వాళ్లిద్దరికి ఓట్లు కూడా బాగానే గుద్దారు. అసలేమైందంటే... నామినేషన్లలో గీతూ, శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్... వీళ్లంతా కలిసి ఇనయాను నామినేట్ చేశారు. సూర్య వెళ్లినందుకు ఆమెనే బూచిలా చూపించారు. నామినేట్ చేయడంలో తప్పలేదు కానీ, నామినేట్ చేసేటప్పుడు వారు మాట్లాడిన తీరు, బాడీ లాంగ్వేజ్ ఇనయాను బాగా బాధ పెట్టేదిలా ఉంది. అందుకే నామినేషన్ తరువాత ఆమె బాత్రూమ్‌లోకి వెళ్లి లాక్ వేసుకుంది. దీంతో అందరూ కాసేపు ఆమెను వెతికారు. చివరికి బెడ్రూమ్‌లోని బాత్రూమ్‌లో ఉన్నట్టు  కనిపెట్టి బయటికి రమ్మని పిలిచినా రాలేదు.బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఆమెతో మాట్లాడారు. ‘ఇక్కడికి రావడం వరకే మీ ఇష్టం, ఇంట్లోంచి పంపించడం అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది’ అని చెప్పి పంపించారు


తరువాత కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు మొదలైంది. అందులో రెండు టీమ్ లుగా విడిపోయారు ఇంటి సభ్యులు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్ గా ఆడారు. మిగతావారంతా బ్లూటీమ్. వారి భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేస్తే ఆ టీమ్ సభ్యుడు చనిపోయినట్టే. ఒకరు మీద ఒకరు పడి స్ట్రిప్పులు లాగుకున్నారు.   మొదట ఫైమా, తరువాత బాలాదిత్య అవుట్ అయ్యారు. 


వీక్ నెస్‌తో గేమ్...
బిగ్ బాస్ భుజబలంతో పాటూ బుద్ధిబలం కూడా చూపమని చెప్పారు. దీంతో గీతూ బుద్ధిబలం అంటే కన్నింగ్ గేమ్, ఎదుటివారి వీక్‌నెస్ తో ఆడుకోవడమే అనుకుంది. ఆమెకు శ్రీహాన్, శ్రీసత్య కూడా జతయ్యారు. ముగ్గురూ కలిసి బాలాదిత్య బలహీనత అయిన సిగరెట్, లైటర్ ను దాచేశారు. అవి కావాలంటే నాలుగు స్ట్రిప్పులు కావాలని అడిగింది గీతూ. దీంతో బాలాదిత్య ఎమోషన్ అయిపోయాడు. గీతూని ‘నువ్వు ఎంతకు దిగజారుతున్నావో నీకైనా అర్థమవుతోందా’ అంటూ తిట్టాడు. ఏడ్చుకుంటూ చాలా మాటలు అన్నాడు. ‘దీన్ని నమ్మద్దు అని ఎంతమంది చెప్పినా బంగారం అని చెప్పా అందరికీ’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక గీతూ కూడా మాటకు మాట సమాధానం ఇస్తూనే ఉంది. మిగతావారు ఆదిత్యను కూల్ చేశారు. 


గీతూ ఆదిరెడ్డిని పిలిచి బాధపడుతూ కనిపించింది. తనను చాలా మాటలు అనేశాడంటూ చెప్పుకుంది.మరి ఆమె ఇనయాను అన్నప్పుడు మాత్రం ఈ బాధ గుర్తుకురాలేదు అదేంటో. ఆదిరెడ్డి దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆయన ఆదిత్య దగ్గరికి వెళ్లి కూర్చుని మీరు తప్పుగా మాట్లాడారు అంటూ చెప్పబోయాడు. ఈ టాస్క్ సగంలో ఉండగానే ఎపిసోడ్ ముగిసింది.  


ఈసారి బాలాదిత్య, గీతూ, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, ఇనయాలలో ఎవరో ఒకరికి వీకెండ్లో గట్టి క్లాసు పడేలాగే ఉంది. ఎవరి పనిని నాగార్జున వ్యతిరేకిస్తారో, సుద్దులు చెబుతారో చూడాలి.


Also read: నామినేషన్స్‌లో ఇంటిసభ్యుల ఓవరాక్షన్, ఎక్కువైన వెటకారం - నామినేషన్స్‌లో ఆ పదిమంది