Ariyana Sky Diving: ఒకప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారంతా ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ ఛానెళ్లు స్టార్ట్ చేసి సెటిల్ అయిపోయారు. కానీ బిగ్ బాస్ వల్ల దాదాపు అందరు కంటెస్టెంట్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగారు. అందుకే వారి ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేశారు కొందరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. అందులో అరియానా గ్లోరీ కూడా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4లో యూట్యూబర్‌గా అడుగుపెట్టిన అరియానా.. ఆ షో తర్వాత మరింత బిజీ అయిపోయింది.  ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోషూట్స్‌ను పోస్ట్ చేస్తూ అందరిని ఫిదా చేస్తోంది. తాజాగా తను పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.


అరియానా స్కై డైవింగ్..


ప్రస్తుతం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా.. దుబాయ్‌లో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక హాలీడేకు వెళ్తూ ఉండే ఈ బ్యూటీ.. తాజాగా దుబాయ్‌లో ల్యాండ్ అయ్యింది. అంతే కాకుండా అక్కడ ఫేమస్ అయిన స్కై డైవింగ్ అడ్వెంచర్‌ను ట్రై చేసింది. ఈ స్కై డైవింగ్‌కు సంబంధించిన మొత్తం వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అరియానా. ‘‘నాకోసం విధి చాలా పెద్దగానే ప్లానే వేసింది. దేవుడు నాకోసం ఇన్ని ఆశీస్సులు దాచి ఉంచాడని ఎప్పుడూ అనుకోలేదు. మీరు జీవించి ఉన్నారు అనిపించే విషయాలతో మాత్రమే మీ జీవితాన్ని నింపేసుకోండి. ఆకాశాన్ని అర్థం చేసుకోవానికి ఒకేఒక్క మార్గం అందులోకి దూకడమే’’ అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది.


కోరిక నెరవేరింది..


స్కై డైవింగ్ కోసం ఫ్లైట్‌లోకి ఎక్కినప్పటి నుంచి అన్ని వీడియోలో చూపిస్తూ వచ్చింది అరియానా. ఆ వీడియోలో విమానం నుంచి కిందకి దూకగానే ఇది జీవితంలో మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అని, చెప్పడానికి మాటలు రావడం లేదని తన సంతోషాన్ని బయటపెట్టింది. అయిపోగానే తనతో పాటు ఉన్న గైడ్‌ను హగ్ చేసుకొని ఈ ఎక్స్‌పీరియన్స్ అందించినందుకు థాంక్యూ చెప్పింది. ఇలాంటి అడ్వెంచర్ చేసినందుకు అరియానా కూడా బాగా ధైర్యం ఉంది అంటూ తన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్కై డైవింగ్ చేయడం తన బకెట్ లిస్ట్‌లో ఒకటి అని, అది నెరవేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ అరియానా.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటపెట్టింది.



బుల్లితెరపై యాంకర్‌గా..


బిగ్ బాస్ సీజన్ 4తో చాలామంది మనసులను దోచేసుకున్న అరియానా.. ఆ తర్వాత కొంతకాలం పాటు మూవీ ఇంటర్వ్యూలను చేసింది. అంతే కాకుండా బిగ్ బాస్ బజ్‌లో కూడా తనే యాంకర్‌గా వ్యవహరించింది. కొన్నాళ్ల నుంచి బుల్లితెరపై పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. కానీ ఏదో ఒకటి చేసి బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం దూరం అవ్వకూడదని అరియానా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తన హాట్ హాట్ ఫోటోషూట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. తన ఫోటోషూట్స్ వల్ల అరియానాకు ఫాలోయింగ్ కూడా పెరిగింది. ప్రస్తుతం అరియానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. జీ తెలుగులో ప్రసారమయ్యే ఒక షోలో యాంకర్‌గా వ్యవహరిస్తోంది అరియానా.


Also Read: ‘సాహో’ శ్రద్ధా కపూర్, హిట్లు తక్కువ ఫాలోవర్లు ఎక్కువ - ప్రభాస్, షారుఖ్‌లను మించి.. సరికొత్త రికార్డ్


Images Credit: Ariyana Glory/Instagram