Bigg Boss OTT 3 Host: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా సీజన్ తర్వాత సీజన్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈ షో సక్సెస్‌ను చూసి ఓటీటీలో కూడా బిగ్ బాస్‌ను ప్రారంభించారు మేకర్స్. ఇది కేవలం ఓటీటీ వరకు మాత్రమే. బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ అయిపోగానే ఓటీటీలో మరో కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. తెలుగులో కూడా అదే జరిగింది. కానీ తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ అంతగా సక్సెస్ సాధించలేదు. అందుకే మరో సీజన్ రాలేదు. కానీ హిందీలో మాత్రం బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన మూడో సీజన్ ప్రారంభం కాగా.. దీనికోసం కొత్త హోస్ట్‌ను రంగంలోకి దించారు మేకర్స్.


హోస్ట్ అందగాడు..


ఇప్పటివరకు హిందీలో బిగ్ బాస్ ఓటీటీ రెండు సీజన్స్‌ను పూర్తిచేసుకుంది. ఈ రెండు సీజన్స్‌కు సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ హోస్టులుగా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ కోసం మరో కొత్త హోస్ట్‌ను రంగంలోకి దించాలనుకున్నారు మేకర్స్. అందుకే మరో సీనియర్ హీరో అయిన అనిల్ కపూర్‌ను బిగ్ బాస్ ఓటీటీ 3కు హోస్ట్‌గా ఎంపిక చేశారు. ఈ విషయంపై అనిల్ కపూర్ గత కొన్నాళ్లుగా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ముందుగా ‘బిగ్ బాస్ ఓటీటీ 3 హోస్ట్ చాలా అందగాడు అని విన్నాను’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేశారు అనిల్. దీంతో అసలు అనిల్ కపూర్ ఎందుకు ఇలా పోస్ట్ చేశారు అని నెటిజన్లు కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. తాజాగా ఆ కన్‌ఫ్యూజన్‌కు ఒక క్లారిటీ వచ్చేసింది.


మ్యూజిక్‌ను చూసేయండి..


బిగ్ బాస్ ఓటీటీ 3కు అనిల్ కపూర్‌ను హోస్ట్‌గా పరిచయం చేస్తూ జియో సినిమా.. సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘వెండితెరపై వెలిగిపోవడం దగ్గర నుండి ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌ను శాసించేవరకు అనిల్ కపూర్ మనకు మరింత దగ్గరయ్యారు కదా.. బిగ్ బాస్ ఓటీటీ 3లో ఆయన మ్యాజిక్‌ను చూసేయండి’ అని ప్రకటించింది జియో సినిమా. ఇప్పటివరకు హిందీ బిగ్ బాస్ ఓటీటీ అనేది వూట్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమ్ అయ్యేది. ఇప్పుడు ఆ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు జూన్ 21 నుండి ప్రారంభమయ్యే బిగ్ బాస్ ఓటీటీ 3ను చూసేయవచ్చని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.






ఎలా ఉండబోతుందో..


అనిల్ కపూర్ లాంటి సీనియర్ హీరో బిగ్ బాస్‌ను ఎలా హోస్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా సరదాగా కనిపించే అనిల్ కపూర్‌కు కోపం కూడా ఎక్కువే. ఈ విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. మరి బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ తప్పు చేస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 21 నుండి ప్రతీరోజు రాత్రి 9.30 గంటలకు జియో సినిమాలో స్ట్రీమ్ అ్వనుంది బిగ్ బాస్ ఓటీటీ 3.


Also Read: సాయి పల్లవి, రణబీర్‌‌ల ‘రామాయణ్’పై సీరియల్ సీత కామెంట్స్ - ఆ మూవీ ఆపేయాలంటూ వ్యాఖ్యలు