Babu Gogineni Comments On NTR: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గెలుపు చూసి చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో వారికి కంగ్రాట్స్ తెలిపారు. ముఖ్యంగా చాలామంది సినీ సెలబ్రిటీలు.. పవన్ కళ్యాణ్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు షేర్ చేశారు. అందులో ఎన్‌టీఆర్ కూడా ఒకరు. ఎప్పటినుండో చంద్రబాబుకు, ఎన్‌టీఆర్‌కు మధ్య మనస్పర్థలు ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు గెలుపుకు కంగ్రాట్స్ చెప్తూ చేసిన ఒక్క ట్వీట్‌తో అందరికీ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఎన్‌టీఆర్ ట్వీట్‌పై బాబు గోగినేని చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మావయ్యకి శుభాకాంక్షలు..


యాక్టివిస్ట్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన బాబు గోగినేని గత కొన్నాళ్లుగా ఏ సినీ సెలబ్రిటీపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఎన్‌టీఆర్‌పై చేసిన కామెంట్స్ చర్చలకు దారితీస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు కంగ్రాట్స్ చెప్తూ ఎన్‌టీఆర్ ఒక ట్వీట్ చేశాడు. ‘‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, బాలకృష్ణ, పురందేశ్వరి సాధించిన గెలుపుకు కూడా కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు ఎన్‌టీఆర్. ఈ ట్వీట్‌కు బాబు గోగినేని కామెంట్ పెట్టారు.






చాతకాని హీరో..


‘‘ట్వీటాడుగా దొంగ చుట్టం.. ఏ తాత పేరు తనకు పెట్టారో, ఆ తాత స్థాపించిన వైద్య విశ్వవిద్యాలయంకు ఉన్న తన తాత పేరును తీసివేసి అప్పటి ముఖ్యమంత్రి తన సొంత తండ్రి పేరు పెట్టుకున్నప్పుడు విమర్శించడం కూడా చేతకాని ధైర్యం లేని హీరో. ఇప్పుడు ఫ్యామిలీ లవ్ ఒలకబోస్తున్నాడు’’ అంటూ ఎన్‌టీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు గోగినేని. ఎన్‌టీఆర్ అంటే నచ్చని చాలామంది ప్రజలు.. ఈ పోస్ట్ కింద నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఒక యాక్టివిస్ట్ అయిన బాబు గోగినేని కూడా ఒక హీరో గురించి ఇలా మాట్లాడడం ఏంటి అని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ గెలుపుకు విష్ చేస్తూ కూడా ఎన్‌టీఆర్ ట్వీట్ షేర్ చేశాడు.




స్పందించని ఎన్‌టీఆర్..


ఎన్‌టీఆర్ రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడు. తనకు ప్రచారాల్లో పాల్గొనడం కూడా పెద్దగా నచ్చదు. కానీ ఒక రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడంతో పాలిటిక్స్‌లో జరిగే చాలా విషయాలకు తాను కూడా స్పందించాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. అంతే కాకుండా తనకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా తన స్పందన కావాలని అడుగుతూ ఉంటారు. అలా చాలా సందర్భాల్లో పలు విషయాలపై ఎన్‌టీఆర్ స్పందించకపోవడంతో తనపై నెగిటివిటీ ఏర్పడింది.


Also Read: మూసి ఉన్న గుడిని తెరిపించిన యంగ్‌ హీరో నిఖిల్‌ - పూలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, వీడియో వైరల్‌