నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న మూడో సీజన్ ఇది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నాడు. మూడో సీజన్లో ఒక ఎపిసోడ్ కి దాదాపు 12 లక్షలు వసూలు చేసిన నాగ్ నాలుగో సీజన్లో పారితోషికం కొద్దిగా పెరిగిందట. ఇక ఐదో సీజన్ వచ్చేసరికి భారీగానే తీసుకుంటున్నాడని టాక్. ఈ సీజన్ మొత్తానికి దాదాపు రూ.11 కోట్ల నుంచి 12 కోట్లు వరకు రెమ్యునరేషన్ అందుతోందని టాక్.
బిగ్ బాస్ రియాల్టీ షోని రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్ ది ముఖ్యమైన పాత్ర. ప్రతి వారాంతంలో వచ్చే హోస్ట్ ఆ వారం మొత్తం మీద ఇంటి సభ్యుల ఆటతీరు మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ సందర్భంలో ఎవరెలా ప్రవర్తిస్తున్నారో గమనించి అవసరమైతే ప్రోత్సహించాలి…అనవసరంగా అతిగా ప్రవర్తించేవారిని కంట్రోలే చేసేలా ఉండాలి. ఈ ప్రాసెస్ లో సందర్భానుసారం మాట్లాడాల్సి ఉంటుంది. ఏమాత్రం కాస్త అటు ఇటుగా మాట్లాడినా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటారు. పైగా హౌజ్ లో కంటిస్టెంట్స్ కి కూడా హోస్ట్ కి అందరం సమానమే అనిపించాలి. అంటే అటు ఇంట్లో సభ్యుల్ని నొప్పించకుండా అక్కడి సమస్యలకు చెక్ పెడుతూ ఆటసాగేలా చేయాలి..ఇటు ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. బిగ్ బాస్ భాషలో చెప్పాలంటే వారం వారం హోస్ట్ కి ఇదో పెద్ద టాస్క్. అందుకే మూడు, నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన నాగార్జుననే ఐదో సీజన్ హోస్ట్ గా ఎంపిక చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ వార్తలపై నాగార్జున కానీ, మేకర్స్ కానీ స్పందించలేదు. అందుకే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
Also read: సరయు vs సన్నీ.. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తానంటూ హీట్ పెంచిన భామ, నామినేషన్లలో రచ్చ!
ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించడంపై నాలుగు రోజుల క్రితం మాట్లాడిన నాగార్జున ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో అందరిలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలన్నదే తమ ప్రయత్నం అన్నాడు. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. ప్రతి నట్టింట్లో వినోదాన్ని పంచే ఈ షోలో భాగస్వామ్యం కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
Also Read: ‘చెత్త’ నామినేషన్లు.. పాయిఖానాలు, చిప్పలు కడుగుతా కానీ.. ప్రియ, రవిలపై లోబో ఫైర్!
Also Read: బిగ్ బాస్ 5లో స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ