"పబ్లిక్ సర్వెంట్‌"పై ఇక అవినీతి కేసులు పెట్టడం అంత సులువు కాదు. అవినీతి నిరోధక చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక "పబ్లిక్ సర్వెంట్‌" కేటగిరిలోకి వచ్చే వారిపై కేసులు పెట్టాలన్నా.. దర్యాప్తు చేయాలన్నా చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. 


ఇక పబ్లిక్ సర్వెంట్లపై కేసులు,విచారణ అంత సులువు కాదు..!


కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్లిక్‌ సర్వెంట్లపై  విచారణ, దర్యాప్తు చేపట్టాలంటే పోలీసు అధికారులు, దర్యాప్తు సంస్థలు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎవరి దగ్గర .. ఏ స్థాయి అధికారిఅనుమతి తీసుకోవాలో కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. డైరక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారి సింగిల్‌ విండో పద్ధతిలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరాలి. అదీ కూడా ప్రభుత్వానికి లేదా సంబంధిత పబ్లిక్‌ సర్వెంట్‌ను తొలగించే అధికారం ఉన్న వ్యక్తికి మాత్రమే ఆ ఫిర్యాదు ఇవ్వాలి. ఫిర్యాదు అందుకునే డీజీ స్థాయి అధికారి  ఫిర్యాదులోని అంశాలు సంబంధిత పబ్లిక్‌ సర్వెంట్‌ను నిందితుడిగా గుర్తించే విధంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. సదరు "పబ్లిక్‌ సర్వెంట్‌" తన అధికార విధుల్లో భాగంగా చేయాల్సినవి చేయకపోవడం, చేయకూడనివి చేయడం వల్ల ఈ అవినీతి జరిగిందని తేలితే  దర్యాప్తు అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. ప్రభుత్వం స్వతంత్రంగా ఆలోచించి, దర్యాప్తు అవసరమో లేదో నిర్ణయిస్తాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తియన తర్వాతనే సదరు పబ్లిక్ సర్వెంట్‌పై విచారణ ప్రారంభమవుతుంది.


Also Read : ఏపీలో ప్రశాంత్ కిషోర్ కొత్త ప్లాన్ !


పబ్లిక్ సర్వెంట్లు అంటే ఎవరెవరు..? 
 
పబ్లిక్ సర్వెంట్లు అంటే విస్తృత ఆర్థం ఉంది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, మేనేజింగ్ డైరక్టర్లు అందరూ పబ్లిక్ సర్వెంట్ల కేటగిరీలోకి వస్తారు.  వీరిపై వచ్చే అవినీతి ఆరోపణలు.. ఇతర అంశాలపై ఫిర్యాదులను ఇక నుంచి డీజీ స్థాయి అధికారి మాత్రమే పరిశీలించి దర్యాప్తునకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.


Also Read : వైసీపీ కీలక నేతను అరెస్ట్ చేసిన ఒరిస్సా పోలీసులు


పబ్లిక్ సర్వెంట్ల కోసం అవినీతి నిరోధక చట్టాన్ని మార్చిన కేంద్రం..!


1988లో రాజీవ్‌గాంధీ హయాంలో అవినీతి నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు. అందులో చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి. 2018లో ఆ చట్టానికి సవరణలు తెచ్చారు. పబ్లిక్‌ సర్వెంట్ల అవినీతిపై దర్యాప్తునకు అనుమతి ఇచ్చే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనలు తెచ్చినట్లుగా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని విభాగాలకూ పంపించింది. అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.


Also Read : ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం బెదిరింపులు


రాజకీయ నేతల అవినీతికి రక్షణ కల్పించినట్లేనా..!?


ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇతర పబ్లిక్ సర్వెంట్ల సంగతేమో కానీ రాజకీయ నేతలకు మాత్రం రక్షణ కల్పించాడనికే  అవినీతి నిరోధక చట్టంలో ఇలాంటి మార్పులు చేశారన్న  ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది. దేశంలో ఉన్నరాజకీయ నేతల్లో అత్యధికం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసులుకూడా నమోదయ్యాయి. ఇక ముందు నుంచి వారిపై ఆధారాలు ఉంటేనే డీజీ స్థాయి అధికారి దర్యాప్తునకు అనుమతిస్తారు. అంటే ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వాళ్లెవరి అవినీతిపైనా విచారణ జరిగే అవకాశం  లేదని చెప్పుకోవచ్చు. అలాగే సులువుగా విపక్ష పార్టీల నేతలు టార్గెట్ అవుతారు. అయితే కోర్టు ఆదేశిస్తే మాత్రం ఎవరిపైనైనా ఈ ప్రక్రియ లేకుండానే దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. 


Also Read : ప్రత్యక విమానంలో రష్యాకు ఏపీ మంత్రి బాలినేని