బిగ్ బాస్ హౌజ్ లోకి గృహప్రవేశం పండుగలా చేశారు. కానీ ఆ మర్నాడే మొదలైన నామినేషన్లు హౌజ్ మేట్స్ మధ్య చిచ్చుపెట్టాయి. నటి ప్రియ తర్వాత నామినేట్ చేసేందుకు వెళ్లిన లోబో నవ్వులు పూయించాడు. నడక, ఏ అరవక్ అంటూ నామినేట్ చేయనున్న మెంబర్స్ చెత్త కవర్ల దగ్గరకెళ్లాడ. మొదట కార్తీకదీపం ఫేం భాగ్యం అదేనండీ ఉమాదేవి కవర్ తీసి పక్కనపడేశాడు. ఆ తర్వాత మరో కవర్ వైపు చూసి విజిల్ వేసుకుంటూ వెళ్లి షణ్ముక్ కవర్ తీసి చిన్న పోరగాడు అని పక్కనపడేశాడు. ఆ టైంలో లోబో ఎవర్ని నామినేట్ చేస్తాడో అర్థంకాక ఆ కామెడీ చూసి ఇంటి సభ్యులు కాసేపు నవ్వుకున్నారు.
ప్రియ చెత్త కవర్ తీసిన లోబో తానూ హైదరాబాదీనే అని, చిన్న సెలబ్రెటీని.. నాక్కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నాకోసం పోరీలున్నారని అన్నాడు. పాయిఖానాలు కడగమన్నా కడుగుతా, చిప్పలు కడగమన్నా కడుగుతా కానీ యాటిట్యూడ్ చూపిస్తే అంతే అన్నాడు. హౌజ్ లోకి అడుగుపెట్టినప్పుడు లోబో మాట్లాడిన మాట తనకు నచ్చేలేదని ప్రియ రిప్లై ఇచ్చింది. ప్రియ యాటిట్యూడ్ చూపించడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. ఆ తర్వాక యాంకర్ రవి చెత్త కవర్ తీసిన లోబో నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అన్నాడు. యాటిట్యూడ్ ఎక్కడ చూపించా అన్న రవితో లోబో చెప్పిన రీజన్ విని నవ్వుకున్నారంతా. తాను యాపిల్ తిన్నప్పుడు కళ్లలోకి కళ్లుపెట్టి చూశావని అది తనకు నచ్చలేదని నామినేటే చేస్తున్నా అన్నాడు లోబో. మొత్తానికి లోబో నామినేన్లు యాటిట్యూడ్ చుట్టూ తిరిగాయ్.
మరోవైపు గతంలో లోబో బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో బిగ్ బాస్ షో గురించి లోబో ఏమన్నాడంటే బిగ్ బాస్ షోకు ఓ దండం రా అయ్యా.. అది నా టేస్ట్ కాదు.. షోలో అవకాశం రాకపోవడమే మంచిది.. నాకు ఆ షో అంటే నచ్చదు.. అంటూ చప్పిన మాటల్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఛాన్స్ రానంత వరకు బిగ్ బాస్ షోను తిట్టడం, ఆ తర్వాత ప్లేటు మార్చడంపై లోబోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Also read: మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటా అన్న సరయు..నచ్చలేదు డార్లింగ్ అన్న సన్నీ..మొదటి వారం నామినేషన్లలో రచ్చ