తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో సందడి షురూ అయింది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుంది. ఇప్పుడు సీజన్ 5 బుల్లితెరపై ప్రేక్షకులను మురిపించనుంది. ఈ సీజన్ కు  కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, మారియట్ హోటళ్లలో క్వారంటైన్ లో ఉన్న కంటిస్టెంట్స్ ఇప్పటికే హౌజ్ లోకి వెళ్లిపోయారు. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ -5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

సీజన్ 5లో ఫైనల్ కంటిస్టెంట్స్ ఎవరెవరంటే…యాంకర్ రవి, యానీ మాస్టర్, యూట్యూబర్ సరయు, రేడియో జాకీ కాజల్, సీరియల్ హీరో మానస్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, కార్తీక దీపం ఉమాదేవి, సిరి హన్మంతు, యాంకర్ వర్షిణి, సింగర్ శ్రీరామచంద్ర, దీపక్ సరోజ్, సీరియల్ నటుడు సన్నీ, మోడల్ జశ్వంత్..ఈ పేర్లలో ఒకటి రెండు కాస్త అటు ఇటు అయినప్పటికీ ఇప్పటికే కంటిస్టెంట్స్ అందరూ హౌజ్ లోకి వెళ్లిపోయారనే చెప్పుకోవాలి.


Also Read:నరేశ్‌ పార్టీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు.. మందుకొడతారు, కలసి భోజనం చేస్తారు తప్పేముందంటూ కామెంట్‌


అయితే  ఈ కంటిస్టెంట్స్ లిస్టులో ఉన్న యూట్యూబర్ సరయు పేరు చూసి వామ్మో అంటున్నారంతా. అసలే కాస్త హాట్ గా ఉండే బిగ్ బాస్ హౌస్ లో…అస్సలు తగ్గేదే లే అనే సరయు ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అంటున్నారంతా.  నోరు తెరిస్తే పచ్చి బూతులు తిట్టే సరయుని ఫ్యామిలీ ఆడియన్స్ ఏమేరకు అంగీకరించగలరో అనే చర్చ నడుస్తోంది. గడిచిన సీజన్‌లో మోనాల్ గజ్జర్, అరియానా, దేత్తడి హారిక వంటి వాళ్లతో మితిమీరి అందాలు ఆరబోయించిన బిగ్ బాస్…ఈ సారి మరింత మసాలా దట్టిస్తూ బూతులకు కేరాఫ్ అడ్రస్ అయిన సరయుని వదులుతున్నారా అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ లెక్కన  రచ్చ మామూలుగా ఉండదని ముందే ఫిక్సైపోయారు ప్రేక్షకులు.


Also Read: జయలలిత సమాధిని సందర్శించిన రీల్ ‘తలైవి’ కంగనా


ఇక  కంటెస్టెంట్స్ లో  ఐదుగురు అత్యధిక పారితోషికంగా తీసుకుంటున్నారట. మిగిలిన కంటెస్టెంట్స్ తో పోల్చితే యాంకర్ రవి, నటి ఉమాదేవి, యూట్యూబర్ షణ్ముఖ్, నటి ప్రియ, కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ అత్యధికంగా తీసుకుంటున్నారని టాక్.  అయితే వారికి షో నిర్వాహకులు ఎంత ఇస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. అలాగే రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి ఒకలా వారి ఫేమ్, నేమ్ తో పాటు బార్గైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒకరి రెమ్యూనరేషన్ గురించి మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. 


Also Read: సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు


Also Read: సరదా తీరిపోతోంది..ఇంక నావల్లకాదంటున్న హీరో కార్తికేయ , అలరిస్తోన్న ''రాజా విక్రమార్క'' టీజర్