దేశంలో పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి..? . దీనికి  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పే సమాధానాలు చాలా ఉంటాయి. నెహ్రూ దగ్గర నుంచి ప్రారంభిస్తారు. ఎవరెవరికి దగ్గరకు చేరుతుందో చెప్పడం కష్టం. తాజాగా అది తాలిబన్ల వద్దకు చేరింది. దేశంలో పెట్రోల్ రేట్లు పెరగడానికి తాలిబన్లే కారణం అని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బల్లాడ్‌ తేల్చేశారు. ఇలా చెప్పడానికి ఆయన మొహమాట పడలేదు. సిగ్గుపడలేదు. అసలు ఆలోచించలేదు. అసువుగా చెప్పేశారు. 


Also Read : కోమటిరెడ్డిని పార్టీ నుంచి వెళ్లిపోవాలన్న మధుయాష్కీ


ఇంతకీ పెట్రోల్ రేట్లు పెరగడానికి తాలిబన్లకు సంబంధం ఏమిటో ఎవరికైనా తెలుసా..? పోనీ ఆయనకైనా తెలుసా..?. తెలుసు .. ఏం తెలుసంటే అప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అందు వల్ల ముడి చమురు సరఫరా తగ్గిపోయిందని తెలుసు. అందుకే ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని తేల్చేశారు. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన  బాధపడిపోతున్నారు. నిజానికి ఆయనకే ఏమీ తెలియదని ఈ వ్యాఖ్యల తర్వాత అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు అది వేరే విషయం. 


Also Read : 18 లక్షలకే టెస్లా కారు


 అసలు ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు చమురు సరఫరానే లేదు. గల్ఫ్ దేశాల నుంచి మెజార్టీ చమురు సరఫరా అవుతుంది. ఆప్ఘనిస్థాన్‌ను కూడా గల్ఫ్ దేశంగా అనుకున్నారు ఘనత వహించిన బీజేపీ ఎమ్మెల్యే.  బయట ఎంత చదువు చదువుకున్నా వాట్సాప్ యూనివర్శిటీల్లో మునిగి తేలుతారో లేక జనం గురించి చాలా తక్కువ స్థాయి అభిప్రాయం ఉందో కానీ ఇలాంటి వ్యాఖ్యలు అసువుగా చేసేస్తూంటారు.  అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయనకు తిట్ల రూపంలో చాలా ప్రశంసలు వస్తున్నాయి. దేశంలో గత కొద్ది నెలల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటి.. పైగా జనాలకు జ్ఞానం లేదని బుద్ధిలేని వ్యాఖ్యలు చేసి.. నీ తెలివితేటలు ప్రదర్శించుకున్నావ్‌ అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు నెటిజన్లు . 


Also Read : ఏపీ రోడ్ల బండారాన్ని బయట పెట్టిన జనసేన


ఇక ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక ఇరాక్‌, సౌదీ అరేబియా, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌, నైజిరియా, అమెరికా, కెనడా దేశాలు భారత్‌కు ముడి చమురు విక్రయిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అఫ్గనిస్తాన్‌ లేదు. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు.. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం అదీ కూడా ప్రజలకేమీ తెలియదని నిందించే ఘరానా శైలీ బీజేపీ నేతలకు మాత్రమే ఉంటుంది.గతంలో కొంత మంది బీజేపీ నేతలు తక్కువకు పెట్రోల‌్ ధరలు కావాలంటే ఆప్ఘనిస్థాన్‌ పోవాలని నిందించిన ఘటనలు కూడా ఉన్నాయి. 


Also Read : తృణమూల్‌కు వరుస కడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు