ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఆ తరువాత హౌస్ మేట్స్ తో పాము నిచ్చెన అనే ఆట ఆడించారు. పాము బొమ్మను పెట్టి ఎవరినైతే మీరు పాము అనుకుంటున్నారో వారిని అక్కడ నిల్చోబెట్టి ఎందుకలా అనుకుంటున్నారో చెప్పమన్నారు. బాలాదిత్య తన గేమ్ లో.. గీతూ పాము అని ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పారు. శ్రీహాన్ తనను గేమ్ లో వెనక్కి లాగుతాడని పాజిటివ్ వేలో అతడికి పాము, గీతూకి నిచ్చెన ఇచ్చారు ఆదిరెడ్డి.  బాలాదిత్యకు పాము.. ఆదిరెడ్డికి నిచ్చెన ఇచ్చారు గీతూ. ఫైమా.. ఇనయాను పాము అని చెప్పింది. ఫ్రెండ్షిప్ పేరుతో కాటు వేసిందని, ఆ మచ్చలు ఇంకా పోవడం లేదని చెప్పారు. గీతూకి నిచ్చెన ఇచ్చారు. 


ఇనయాకు షాకిచ్చిన నాగార్జున:


ఇక ఇనయా విషయానికి వచ్చిన నాగార్జున నీ మనసులో ఉన్నదేంటో నాకు అర్థమైంది అన్నారు. బిగ్‌బాస్ స్టోర్ రూమ్ కి వెళ్లమని చెప్పారు. ఇనయా సూర్య వచ్చాడేమో అనుకుని స్టోర్ రూమ్ వైపు పరుగెత్తింది. అక్కడ సూర్య ఫొటోతో ఉన్న లాలీపాప్ ఉంది. అది చూసుకొని మురిసిపోయింది ఇనయా. ఆ తరువాత సీక్రెట్ రూమ్ కి వెళ్లమని చెప్పారు నాగార్జున. ఈసారి సూర్య నిజంగానే వస్తాడని భావించారు ఇనయా. కానీ సీక్రెట్ రూమ్ లో ఎవరూ లేరని.. నీ గేమ్ మీద ఫోకస్ చేయ్ అంటూ ఇనయాకు చెప్పారు నాగార్జున. 


రేవంత్ కి నాగార్జున పంచ్:


ఆ తరువాత ఇనయా.. ఆదిరెడ్డికి పాము, గీతూకి నిచ్చెన ఇచ్చారు. ఇక రాజ్.. ఆదిని పాము అని చెప్పారు. ఆయన మైక్ విసిరేయడం వల్ల అందరం కెప్టెన్సీ కంటెండర్లం అయ్యే ఛాన్సు పోగొట్టుకున్నామని చెప్పారు. ఫైమాని నిచ్చెన అన్నారు. రోహిత్.. గీతూని పాము అని, మెరీనాకి నిచ్చెన ఇచ్చారు. ఇనయాకు పాము, రేవంత్ కి నిచ్చెన ఇచ్చారు శ్రీహాన్. రేవంత్.. శ్రీహాన్ కి నిచ్చెన ఇచ్చి.. వసంతిని పాము అన్నారు. ఆమె కళ్లు పాము కళ్లలా ఉంటాయని అందుకే అలా అన్నానని చెప్పారు. దానికి నాగార్జున మీ ఆవిడ కళ్లు గుర్తపట్టలేకపోయావు కానీ, వసంతి కళ్లు గుర్తుపట్టావా అని అడిగారు.  శ్రీహాన్ కి పాము, ఆదిరెడ్డికి నిచ్చెన ఇచ్చారు వసంతి. శ్రీహాన్ కి పాము, మెరీనాకు నిచ్చెన ఇచ్చారు కీర్తి. గీతూకి పాము, ఆదిరెడ్డికి నిచ్చెన ఇచ్చారు మెరీనా. శ్రీసత్య.. ఫైమాకి పాము, గీతూకి నిచ్చెన ఇచ్చారు. 


బాలాదిత్య, మెరీనా సేఫ్:


నిన్నటి ఎపిసోడ్ లో కీర్తి, ఆదిరెడ్డి సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఇక నామినేషన్స్ లో మిగిలిన గీతూ, ఫైమా, ఇనయా, శ్రీసత్య, మెరీనా, బాలాదిత్య, రోహిత్ లకు బాంబ్ టాస్క్ ఇచ్చి.. అందులో మెరీనా, బాలాదిత్యలు సేఫ్ అయినట్లు ప్రకటించారు. 


హౌస్ మేట్స్ ని గార్డెన్ ఏరియాలోకి పిలిపించి.. వారితో ఫల ఫ్లవర్ అండ్ బీ అనే గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో ఇంటి సభ్యులను తుమ్మెదల్లా రెడీ అయ్యారు. పాట వేసినప్పుడు డాన్స్ చేస్తూ.. పాట ఆగగానే అక్కడ సెట్ చేసి ఉంచిన ఫ్లవర్ స్టేషన్ దగ్గర వెళ్లి నిల్చోవాలి. ఎవరికైతే పువ్వు దక్కతో వారు అవుట్ అయినట్టు. అలా ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయి చివరకి ఒకరు విన్నర్ అవుతారు. ఈ గేమ్ లో రేవంత్ విన్నర్ గా గెలిచారు.


ఇనయా సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కి గ్రీన్ లైట్, రెడ్ లైట్ టాస్క్ ఇచ్చి ఇనయా సేఫ్ అని ప్రకటించారు. 


ఫైమా, రోహిత్ సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కి ఫ్లైట్ టాస్క్ ఇచ్చి అందులో ఫైమా, రోహిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. 


శ్రీసత్య సేఫ్.. గీతూ ఎలిమినేషన్:


నామినేషన్స్ లో చివరి వరకు శ్రీసత్య, గీతూలను ఉంచి వారికొక ఫిష్ ట్యాంక్ టాస్క్ ఇచ్చి.. శ్రీసత్య సేఫ్ అయినట్లు, గీతూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. 


ఆమె ఎలిమినేషన్ ఊహించని హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. గీతూ ఏడ్చేశారు. రేవంత్, ఫైమా అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు. వెళ్లిపోతూ.. వెళ్లిపోతూ తను ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించమని కోరారు గీతూ. తనకు వెళ్లాలని లేదని.. బిగ్ బాస్ కి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది గీతూ. 


స్టేజ్ పైకి వెళ్లిన గీతూ.. హౌస్ మేట్స్ తో మాట్లాడింది. వారందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. గీతూని షో బ్రేకర్స్ ఎవరు..? షో మేకర్స్ ఎవరో చెప్పమని అడిగారు నాగార్జున. షో మేకర్స్ లిస్ట్ లో ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ పేర్లు చెప్పారు. షో బ్రేకర్స్ లిస్ట్ లో.. బాలాదిత్య, ఇనయా, కీర్తి, వసంతి, మెరీనా, రోహిత్ ల పేర్లు చెప్పారు. 


Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!